Share News

Viral video: స్విమ్మింగ్ చేస్తుండగా షాకింగ్ సీన్.. నీళ్లలో నుంచి బయటికి వచ్చిన బాలుడు.. చూస్తుండగానే..

ABN , Publish Date - Jun 22 , 2024 | 08:46 PM

సంతోషంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటాయి. అప్పటిదాకా మన మధ్య ఉన్న వారు ఉన్నట్టుండి మృత్యు ఒడిలోకి జారుకోవడం చూస్తుంటాం. ఇలాంటి ..

Viral video: స్విమ్మింగ్ చేస్తుండగా షాకింగ్ సీన్.. నీళ్లలో నుంచి బయటికి వచ్చిన బాలుడు.. చూస్తుండగానే..

సంతోషంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటాయి. అప్పటిదాకా మన మధ్య ఉన్న వారు ఉన్నట్టుండి మృత్యు ఒడిలోకి జారుకోవడం చూస్తుంటాం. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్విమ్మింగ్ పూల్ వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు స్విమ్మింగ్ చేస్తూ మధ్యలో నీళ్లలో నుంచి బయటికి వచ్చాడు. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్‌లోని నివాల్‌ఖాస్ పట్టణంలో జూన్ 21న ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న స్విమ్మింగ్ పూల్లో చాలా మంది ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో కొందరు బాలురు క్రికెట్ ఆడిన తర్వాత సేద తేరేందుకు స్విమ్మింగ్‌కు (Swimming) వెళ్లారు. అంతా కలిసి స్విమ్మింగ్ పూల్లో సరదాగా ఈత కొడుతున్నారు.

Viral video: గుండెల్ని పిండేసే వీడియో.. మందలిస్తున్న మావటిని.. ఈ ఏనుగు చివరకు..


అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి విషాద ఘటన చోటు చేసుకుంది. సమీర్ (17) అనే బాలుడు ఈత కొడుతూ మధ్యలో నీళ్లలో నుంచి బయటికి వచ్చాడు. అయితే కొద్ది దూరం నడవగానే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతా పరుగెత్తుకుంటూ అతడి వద్దకు వచ్చి చూశారు. చలనం లేకుండా పడి ఉన్న బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Viral video: ఫొటో దిగడానికి వచ్చిన వరుడి స్నేహితులు.. చివరకు వధువునే సైడ్ చేసి..


బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమీర్ గుండె పోటు (boy died of heart attack) కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మొత్తం అక్కడే స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘అయ్యో పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇది చాలా బాధకరం’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: రాత్రివేళల్లో గేదెలు మేయడానికి వీలుగా.. ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 22 , 2024 | 08:46 PM