Share News

Viral video: ఇది కదా స్నేహమంటే.. పాము నుంచి సహచురుడిని కాపాడేందుకు.. ఈ ఉడుత చేసిన పని..

ABN , Publish Date - Jun 23 , 2024 | 09:24 PM

పాముల దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములు దాడులు చేసిన ఘటనలో చాలా జంతువులు చివరకు ప్రాణాలు కోల్పోతుంటాయి. అయితే కొన్నిసార్లు ...

Viral video: ఇది కదా స్నేహమంటే.. పాము నుంచి సహచురుడిని కాపాడేందుకు.. ఈ ఉడుత చేసిన పని..

పాముల దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములు దాడులు చేసిన ఘటనలో చాలా జంతువులు చివరకు ప్రాణాలు కోల్పోతుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న జంతువులు సైతం పాములతో పోటీకి దిగుతుంటాయి. వాటి నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంటాయి. మరికొన్నిసార్ల తమ పిల్లలను కాపాడేందుకు తల్లి జంతువులు పాములతో తలపడుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఉడుత తన సహచరుడిని కాపాడేందుకు పాముతో తలపడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు .. ‘‘స్నేహమంటే ఇదేరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము ఉడుతను టార్గెట్ చేసింది. చివరకు దానిపై దాడి చేసి నోటితో పట్టుకుని చుట్టేసింది. దాన్నుంచి తప్పించుకునేందుకు ఉడుత శతవిధాలా ప్రయత్నించింది. కానీ దాని వల్ల సాధ్యం కాలేదు. ఇంతలో మరో ఉడుత గమనిస్తుంది. తన స్నేహితుడిపై పాము దాడి చేయడాన్ని చూసి రగిలిపోతుంది. ముందూ వెనుకా ఆలోచించకుండా (Squirrel attacked the snake) పాముపై ఎదురుదాడికి దిగుతుంది. పాము కూడా ఆ ఉడుతపై కాటేయడానికి ప్రయత్నిస్తుంటుంది.

Viral video: ఇది ఏనుగుల దండ‘యాత్ర’.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటుతున్నాయో చూస్తే..


అయితే పాము కాటు నుంచి తెలివిగా తప్పించుకుంటూనే తన స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో పామును గట్టిగా కొరికేస్తుంది. ఇలా చాలా సేపు పాముతో పోరాడుతుంది. చివరకు పామను నుంచి తన సహచరుడిని క్షేమంగా రక్షిస్తుంది. ఉడుతను పక్కకు లాగిన తర్వాత.. స్నేహితుడిని నోటితో పట్టుకుని పాముకు దూరంగా తీసుకెళ్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఉడుతను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఉడుత పోరాటం మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: ఖంగుతినిపించిన ఫోన్.. అంత్రకియలు నిర్వహిస్తుండగా బతికొచ్చిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..

Updated Date - Jun 23 , 2024 | 09:37 PM