Share News

Viral video: ప్రాణాల మీదకు తెచ్చిన స్టంట్.. ఈ బాలుడికి చివరకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:57 PM

కొందరు ఎలాంటి అవగాహన లేకండా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. బైక్‌పై విన్యాసాలు చేస్తూ కొందరు, మరికొందరు వివిధ రకాల వస్తువులతో..

Viral video: ప్రాణాల మీదకు తెచ్చిన స్టంట్.. ఈ బాలుడికి చివరకు ఏమైందో చూడండి..

కొందరు ఎలాంటి అవగాహన లేకండా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. బైక్‌పై విన్యాసాలు చేస్తూ కొందరు, మరికొందరు వివిధ రకాల వస్తువులతో విచిత్ర ప్రయోగాలు చేస్తూ చివరకు ప్రమాదంలో పడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు స్టేజిపై చేతికి నిప్పు వెలిగించుకుని డేంజరస్ స్టంట్ చేస్తుండగా చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు (Tamil Nadu) చెన్నైలోని నీలంకరైలో జూన్ 22న ఈ ఘటన చోటు చేసుకుంది. నటుడు, రాజకీయవేత విజయ్ (Actor Vijay) పుట్టిన రోజు సందర్భంగా స్థానికంగా ఉన్న అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11 ఏళ్ల ఓ బాలుడు విన్యాసాలు చేసేందుకు వేదిక మీదకు ఎక్కాడు. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తున్న అతను.. చేతిపై మంట వెలిగించుకుని, ఇటుకలను పగులగొట్టే విన్యాసం (Boy stunts) చేసేందుకు సిద్ధమయ్యాడు.

Viral video: ఏసీని పగులగొట్టి.. చివరకు ఎలా తయారు చేశాడో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


ఎదురుగా మూడు ఇటుకలను ఒకదాని మీద మరొకటి పేర్చాడు. చేతిపై పెట్రోల్ పోసుకుని మంట వెలిగించాడు. మంటలు అంటుకున్న చేత్తోనే ఇటుకలను పగులగొట్టేందుకు సిద్ధమయ్యాడు. అనుకున్నట్లుగానే ఇటుకలను ఒకేసారి ఫట్‌మని పగులగొట్టాడు. అయితే తర్వాత చేతిపై ఉన్న (Boy hand caught fire) మంటలు ఇంకా పెద్దవయ్యాయి. దీంతో భయపడిన బాలుడు.. వాటిని ఆర్పే క్రమంలో అటూ ఇటూ పరుగెత్తాడు. పక్కనే పెట్రోల్ బాటిల్ పట్టుకుని ఉన్న వ్యక్తి బాలుడికి అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ క్రమంలో అతడి చేతిలోని పెట్రోల్ మీద పడి మంటలు మరింత పెద్దగా మారతాయి.

Viral video: ఫొటో దిగడానికి వచ్చిన వరుడి స్నేహితులు.. చివరకు వధువునే సైడ్ చేసి..


ఈ క్రమంలో ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడిపోతాడు. చివరకు అంతా చుట్టూ చేరి ఎలాగోలా మంటలను ఆర్పేసి, అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం..! ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి స్టంట్స్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: రాత్రివేళల్లో గేదెలు మేయడానికి వీలుగా.. ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 23 , 2024 | 03:57 PM