Share News

Viral video: ఇది ఏనుగుల దండ‘యాత్ర’.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటుతున్నాయో చూస్తే..

ABN , Publish Date - Jun 23 , 2024 | 08:31 PM

వర్షాకాలంలో కాలువులు, నదులు దాటే సమయంలో మనుషులు, జంతువులు ఇబ్బందులు పడడం చూస్తుంటాం. అయితే కొన్ని జంతువులు మాత్రం ఎంతో తెలివిగా నదులను దాటుతుంటాయి. ఉదృతంగా..

Viral video: ఇది ఏనుగుల దండ‘యాత్ర’.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటుతున్నాయో చూస్తే..

వర్షాకాలంలో కాలువులు, నదులు దాటే సమయంలో మనుషులు, జంతువులు ఇబ్బందులు పడడం చూస్తుంటాం. అయితే కొన్ని జంతువులు మాత్రం ఎంతో తెలివిగా నదులను దాటుతుంటాయి. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని కొన్ని సింహాలు ఎంతో చాకచక్యంగా దాటడం చూశాం. అయితే జంతువుల్లోనే అతి పెద్దవైన ఏనుగులకు నదులను దాటడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకు నిదర్శంగా ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏనుగుల మంద ఉదృహిస్తున్న అతి పెద్ద నదిలోకి మూకుమ్మడిగా దూకేశాయి. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. నదులు దాటే ఏనుగులను చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒకటి, రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో ఏనుగులు మూకుమ్మడిగా నదిలోకి దిగాయి. బ్రహ్మపుత్ర నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అయితే అటుగా వచ్చిన ఏనుగుల మంద.. ఎలాగైనా నది అవతలి వైపునకు వెళ్లాలని నిర్ణయించుకుంది. చివరకు అన్నీ కలిసి ఐకమత్యంగా ఒకేసారి నదిలోకి దిగాయి. అంత ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని (Elephants crossing the river) ఎంతో చాకచక్యంగా దాటాయి.

Viral: ఖంగుతినిపించిన ఫోన్.. అంత్రకియలు నిర్వహిస్తుండగా బతికొచ్చిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..


నది మధ్యలో ఏనుగులు దాదాపు మునిగిపోయే పరిస్థితి ఉన్నా కూడా అవి మాత్రం ఏమాత్రం భయకుండా తెలివిగా నదిని దాటేశాయి. చాలా పొడవుగా ఉన్న నదిలో ఏనుగుల మంద గుంపుగా వెళ్తూ చిన్న చిన్న ఏనుగలను వాటి మధ్యలో పెట్టుకుని చివరకు అన్నీ సురక్షితంగా నది అవతలి వైపునకు వెళ్లాయి. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ కెమెరాల్లో బందించారు. అస్సాంలోని (Assam) కాజిరంగా చుట్టుపక్కల ప్రాంతాలు నీటిలో మునిగిపోయిన సందర్భాల్లో.. ఆహార వేటలో భాగంగా ఏనుగులు ఇలా నదిని దాటుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ వీడియో వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగుల ఐఖ్యత బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘చాలా అద్భుతంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: సింహం గాఢ నిద్రలో ఉండగా.. దగ్గరికి వెళ్లిన జింక పిల్ల.. అటూ ఇటూ చూసి చివరకు..

Updated Date - Jun 23 , 2024 | 08:58 PM