Share News

Pani Puri: పానీ పూరీ తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే ముట్టుకోరు!

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:58 AM

పానీ పూరీ(Pani Puri) చూసి నోరు చప్పరిస్తున్నారా.. ఆగలేక పానీ పూరీ ఆరగించేస్తున్నారా. అయితే మీరు హాస్పిటల్ వెళ్లాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ మాట చెప్తున్నది మేం కాదు. వైద్యులే చెబుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. పానీపూరీని సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు

Pani Puri: పానీ పూరీ తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే ముట్టుకోరు!

ఇంటర్నెట్ డెస్క్: పానీపూరీ(Pani Puri) చూసి నోరు చప్పరిస్తున్నారా..? ఆగలేక ఎంచక్కా ఆరగించేస్తున్నారా..? అయితే మీరు హాస్పిటల్ వెళ్లాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ మాట చెబున్నది మేం కాదండోయ్.. స్వయంగా వైద్యులే చెబుతున్న మాట. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. పానీపూరీని సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. కర్ణాటకలో ఫుడ్ సెఫ్టీ అధికారులు వివిధ పానీపూరి సెంటర్లలో తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

ఎందుకు.. ఏమైంది?

పానీపూరిలో వాడే నీటిని తాగితే క్యాన్సర్ రావడం పక్కా అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కర్ణాటకలో తనిఖీలు పూర్తయ్యాక.. తమిళనాడు అధికారులు చెన్నై అంతటా పానీపూరీ దుకాణాలపై తనిఖీలు చేశారు. కర్ణాటకలోని దుకాణాల్లో పానీపూరీ రుచి, నీటి రంగు కోసం బ్రిలింట్ బ్లూ, టార్ట్రజైన్, సన్‌సెట్ ఎల్లో వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారని గుర్తించారు.


ఇవి కలిపిన పానీపూరీ తినడం వల్ల క్యాన్సర్ రావడం గ్యారెంటీ అని వైద్యులు చెబుతున్నారు. తమిళనాడులో జరిపిన పరీక్షల్లో కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో పానీ పూరీ అమ్మకాలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.

వీటికి తోడు చాలా చోట్ల అపరిశుభ్రవాతావరణంలో పానీపూరి అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో క్యాన్సర్‌తో పాటు ఎన్నో రోగాలు చుట్టుముడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పానీపూరీ సెంటర్లపై కూడా ఫుడ్ సేఫ్టి అధికారులు తనిఖీలు నిర్వహించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కెమికల్స్ కలుపుతూ.. తినే ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 04 , 2024 | 12:37 PM