Share News

Viral video: కేర్‌టేకర్‌తో అనవసరంగా పెట్టుకుందే.. చేయి కొరికేయాలని చూసిన చిరుతకు ఎలాంటి షాక్ ఇచ్చాడంటే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 04:46 PM

చిరుత పులులు, సింహాల చేతికి ఒక్కసారి చిక్కామంటే.. ఇక ప్రాణాల పోవడం తప్ప బయటపడే అవకాశమే ఉండదు. అయినా చాలా మంది వాటితో పరాచకాలు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు...

Viral video: కేర్‌టేకర్‌తో  అనవసరంగా పెట్టుకుందే.. చేయి కొరికేయాలని చూసిన చిరుతకు ఎలాంటి షాక్ ఇచ్చాడంటే..

చిరుత పులులు, సింహాల చేతికి ఒక్కసారి చిక్కామంటే.. ఇక ప్రాణాల పోవడం తప్ప బయటపడే అవకాశమే ఉండదు. అయినా చాలా మంది వాటితో పరాచకాలు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొన్నిసార్లు పులులను కేర్‌టేకర్లకూ షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కేర్‌టేకర్‌.. ఆహారం అందించేందుకు చిరుత పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్తాడు. అయితే ఈ క్రమంలో పులి అతడిపై దాడికి దిగుతుంది. చివరకు దానికి ఎలాంటి షాక్ ఇచ్చాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలో (South Africa) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కేర్‌టేకర్ రోజూ మాదిరే ఆ రోజు కూడా చిరుత పులులకు ఆహారం అందించేందుకు వాటి ఎన్‌క్లోజర్స్‌లోకి వెళ్తాడు. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికి చిరుత పులి. ఉన్నట్టుండి అతడిపై (tiger attacks caretaker) దాడి చేస్తుంది. చివరకు అతడి చేయిని గట్టిగా పట్టుకుని కొరికే ప్రయత్నం చేస్తుంది. దీంతో అతను నొప్పిని తాళలేక విలవిల్లాడిపోతాడు.

Viral video: వధువును ముద్దు పెట్టుకున్న వరుడు.. ఆ వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్... ఏం జరిగిందని విచారించగా..


చిరుత పులి నుంచి విడిపించుకునే క్రమంలో విశ్వప్రయత్నాలు చేస్తాడు. అయినా చిరుత మాత్రం అతడి చేయినని మాత్రం వదలదు. కాసేపటికి ఇంకో వ్యక్తి గమనించి పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. అతడు కూడా చిరుత పులి చేయి వదిలే వరకూ పోరాడతాడు. ఎట్టకేలకు చిరుత చేయి వదలగానే అతను పైకి లేచి, చివరకు చిరుత వెనుక కాలు పట్టుకుని లాగుతాడు. తర్వాత చిరుతపులిని గిరాగిరా తిప్పి దూరంగా విసిరేస్తాడు.

Viral video: పాము కాటేసిందనే కోపంతో తల కొరికి మింగేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


మళ్లీ అతడిపై దాడి చేయాలని చూసిన చిరుతను కాలితో తన్నే ప్రయత్నం చేస్తాడు. దెబ్బకు భయపడిపోయిన చిరుత అక్కడి నుంచి పారిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిరుతకు చుక్కలు చూపంచాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: నిధి కోసం వెతుకుతుండగా బయటపడ్డ సంచి.. సడన్‌గా లోపలి నుంచి దూసుకొచ్చిన పాము.. చివరకు..

Updated Date - Jun 15 , 2024 | 04:48 PM