Viral Video: మందు పవరా.. మజాకా.. రైలింజన్‌కు ఎదురెళ్లిన మందుబాబు.. చివరకు జరిగింది చూస్తే..
ABN , Publish Date - Dec 11 , 2024 | 01:51 PM
మద్యం మత్తులో మందుబాబులు కొన్నిసార్లు రచ్చ రచ్చ చేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రోడ్డుపై మురుగునీటిలో పడుకోవడం, ప్రమాదకర పాములను మెడలో వేసుకోవడం, రోడ్డుపై వాహనాలను ఆపుతూ హల్‌చల్ చేయడం చేస్తుంటారు. ఇలాంటి ..
మద్యం మత్తులో మందుబాబులు కొన్నిసార్లు రచ్చ రచ్చ చేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రోడ్డుపై మురుగునీటిలో పడుకోవడం, ప్రమాదకర పాములను మెడలో వేసుకోవడం, రోడ్డుపై వాహనాలను ఆపుతూ హల్‌చల్ చేయడం చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మందుబాబు ఏకంగా రైలింజన్‌కే ఎదురెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బారాబంకి రైల్వే క్రాసింగ్ వద్ద చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి రైల్వే క్రాసింగ్ వైపు వెళ్లాడు. అక్కడ రైల్వే ట్రాక్స్ దాటుతుండగా.. అదే సమయంలో ఓ రైలు అటుగా వస్తోంది. అయినా అతడిలో ఏమాత్రం భయం, కంగారు కనిపించలేదు.
Viral Video: ప్రమాదానికి గురైన బైకర్‌ను చూసి కారు ఆపాడు.. ఆ వెంటనే జరిగిన ఘటనతో ఖంగుతిన్నాడు..
పైగా రైలు పట్టాల మధ్యలో (drunk man went in front of the train) నిలబడి, రైలుకు ఎదురెళ్లాడు. పట్టాలపై వ్యక్తి ఉండడాన్ని చూసిన రైలు డ్రైవర్ ఇంజిన్‌కు బ్రేకులు వేశాడు. తీరా రైలు దగ్గరికి రాగానే ఆ వ్యక్తి పకక్కు వెళ్లి రైలు డ్రైవర్‌ను ఏదో అనబోయాడు. అప్పటికే ఆవేశంగా ఉన్న రైలు డ్రైవర్.. మందుబాబును చూసి మరింత ఆగ్రహానికి గురవుతాడు. అయితే అప్పటికే మందుబాబు దూరంగా వెళ్లిపోవడంతో రైలు డ్రైవర్ శాంతించి వెళ్లిపోయాడు.
Optical illusion: కేవలం డేగ చూపు గల వారే.. ఇందులో దాక్కున్న బ్రష్‌ను 15 సెకన్లలో గుర్తించగలరు..
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మందుబాబు ధైర్యం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ మందుబాబుకు కనీసం లక్ష వరకూ జరిమానా విధించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చిరుత పులులకు చుక్కలు చూపించిన నక్క.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..