Viral Video: ఇది మామూలు ట్రైనింగ్ కాదురా బాబోయ్.. ఆమె ఇలా చెప్పగానే.. పావురం చేసిన పని చూడండి..
ABN , Publish Date - Dec 11 , 2024 | 07:49 AM
పావురాలను ఒకప్పటి రాజులు పోస్ట్‌మాన్‌లా ఉపయోగించేవారని అందరికీ తెలుసు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఉత్తర ప్రత్యుత్తరాలు అందిస్తూ సేవలందించేవి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అలాంటి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
పావురాలను ఒకప్పటి రాజులు పోస్ట్‌మాన్‌లా ఉపయోగించేవారని అందరికీ తెలుసు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఉత్తర ప్రత్యుత్తరాలు అందిస్తూ సేవలందించేవి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అలాంటి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళ పావురానికి అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చింది. ఆమె ఇలా చెప్పగానే.. పావురం చేస్తున్న పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది మామూలు ట్రైనింగ్ కాదురా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) తన ఇంట్లో పావురాన్ని పెంచుకుంటోంది. అయితే దానికి ఉత్తరాలు తెచ్చిపెట్టే పని కాకుండా ఏదైనా పెద్ద పని అప్పజెప్పాలని ఆలోచించింది. ఏకంగా కిరాణా కొట్టుకు వెళ్లి తనకు కావాల్సిన సరుకులు తెచ్చేలా ట్రైనింగ్ ఇచ్చింది. చివరకు ఆ పావురం (pigeon) ఎలా పని చేస్తుందో చూడాలని అనుకుంది.
Viral Video: వామ్మో.. ఇలాక్కూడా జరుగుతుందా.. మహిళ నడుస్తూ వెళ్తుండగా ఫుట్‌పాత్‌పై పేలుడు.. చివరకు..
ఇందుకోసం దాని మెడలో కవర్ తగిలించి, మ్యాగీ ప్యాకెట్ తీసుకురావాలని చెప్పింది. యజమాని ఇలా చెప్పగానే పావురం రివ్వున ఎగురుకుంటూ దుకాణానికి వెళ్లింది. పావురం రాగానే విషయం అర్థం చేసుకున్న దుకాణ యజమాని.. దాని మెడలోని కవర్ తీసుకుని, అందులో మ్యాగీ ప్యాకెట్ పెట్టి మళ్లీ కవర్‌ను దాని మెడకు తగిలించాడు. దీంతో ఆ పావురం కవర్ మ్యాగీ ప్యాకెంట్ తీసుకుని, (pigeon brought Maggi packet to the owner) ఎగురుకుంటూ వెళ్లి యజమానికి అందించింది.
Viral Video: వామ్మో.. ఈ హిప్పో బెదిరింపు మామూలుగా లేదుగా.. వాహనాన్ని వెంబడించి మరీ.. చివరకు..
పావురం చేసిన పనికి ఆమె ఎంతో సంతోషించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సూపర్.. కిరాణా సరుకులు మోసుకొస్తున్న పావురం’’.. అంటూ కొందరు, ‘‘ఈ పావురం టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వావ్.. ఈ కోతి ఆటలు మామూలుగా లేవుగా.. ఇంటిపైకి ఎక్కి ఏం చేస్తుందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..