Viral Video: పండ్లు ఎక్కువగా కొంటున్నారా.. ఈ బండిపై గబ్బిలం చేస్తున్న పని చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 10 , 2024 | 07:06 PM
ప్రస్తుతం బయటి మార్కెట్లో ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించకపోవడంతో పాటూ కల్తీ చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను ఇటీవల రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే..
ప్రస్తుతం బయటి మార్కెట్లో ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించకపోవడంతో పాటూ కల్తీ చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను ఇటీవల రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. పండ్ల బండిపై ఓ గబ్బిలం చేస్తున్న నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ గబ్బిలం ఏం చేస్తుందో మీరూ చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన పూణేలో (Pune) చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఓ పండ్ల దుకాణంలో (fruit shop) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు వేలాడాల్సిన గబ్బిలం అందుకు విరుద్ధంగా పండ్ల బండిపై వాలింది. అంతటితో ఆగకుండా రెక్కలను చాపి మరీ అక్కడున్న సపోటాలను కొరికి మరీ తింటోంది.
Viral Video: ఏనుగు గూండాగిరి.. రోడ్డుపై వాహనాలను బలవంతంగా ఆపి మరీ..
తిన్న సపోటాను మొత్తం నోటి దవడల మధ్య పెట్టుకుని మరీ లాగించేస్తోంది. ఆ గబ్బిలం చాలా సేపు పండ్ల బండిపైనే (bat eating Sapota) ఉండి మరీ సోపోటాలను తినేసింది. సాధారణంగా చెట్టుపై వేలాడే గబ్బిలాలు.. ఇలా విచిత్రంగా పండ్లను తినడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ లేనిపోని రోగాలు వస్తాయేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: చిరుత పులితో కుక్క పోరాటం.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గబ్బిలాలు పండ్లు తినడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘గబ్బిలం తిన్న పండ్లను తినడం రోగాలకు దారి తీస్తుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23 వేలకు పైగా లైక్‌లు, 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇలాంటి వాడిని ఏం చేయాలి.. వేదికపై యువతి డాన్స్ చేస్తుండగా.. సమీపానికి వెళ్లి..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..