Share News

Viral Video: చిరుత పులులకు చుక్కలు చూపించిన నక్క.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Dec 11 , 2024 | 10:36 AM

సింహాలు, చిరుతపులులు ఎంత భయంకరమైన జంతువులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం సులభంగా వేటాడి చంపేగలవు. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాకర జంతువులను సైతం కొన్ని చిన్న చిన్న జంతువులు ఆటాడుకుంటుంటాయి. మరికొన్నిసార్లు..

Viral Video: చిరుత పులులకు చుక్కలు చూపించిన నక్క.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

సింహాలు, చిరుతపులులు ఎంత భయంకరమైన జంతువులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం సులభంగా వేటాడి చంపేగలవు. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాకర జంతువులను సైతం కొన్ని చిన్న చిన్న జంతువులు ఆటాడుకుంటుంటాయి. మరికొన్నిసార్లు మరీ చిన్న జంతువుల చేతిలోనూ ఓడిపోతుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరుత పనులలకు ఓ నక్క చుక్కలు చూపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో మూడు చిరుత పులులు వేట కోసం ఎదురు చూస్తుంటాయి. ఇంతలో వాటికి ఓ నక్క పిల్ల కనిపించింది. నక్క పిల్లే కదా అని చిరుత పులులు (Leopards) వెంటనే దానిపై దాడికి దిగాయి. అయితే నక్క పిల్ల (fox cub) మాత్రం ఏమాత్రం భయపడకుండా చిరుత పులులతో ఓ ఆట ఆడుకుంటుంది.

Viral Video: ఇలాంటి తెలివితేటలు ఇతడికే సాధ్యం.. చలి తగలకుండా మంచం కింద ఇలా ఎవరైనా చేస్తారా..


నక్క పిల్ల అటూ, ఇటూ పరుగెడుతూ చిరుత పులులను తికమకపెట్టింది. చిరుతపులులు నక్క పిల్ల వెంటే పరుగెత్తగా... కొంచెం దూరం పరుగెత్తగా ఉన్నట్టుండి వెనక్కు తిరిగింది. దీంతో అప్పటిదాకా వెంటపడిన చిరుత పులలు.. నక్క చేష్టలు చూసి అవాక్కవుతాయి. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: మొసళ్లు ఎంత డేంజరో తెలుసా.. నీళ్లు తాగడానికి వెళ్లిన పందిని ఎలా పట్టుకున్నాయో చూస్తే..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిరుతపులులకు చుక్కలు చూపించిన నక్క పిల్ల’’.. అంటూ కొందరు, ‘‘ఈ నక్క టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13వేలకు పైగా లైక్‌లు, 1.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది మామూలు ట్రైనింగ్ కాదురా బాబోయ్.. ఆమె ఇలా చెప్పగానే.. పావురం చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 11 , 2024 | 11:06 AM