Share News

Viral Video: వామ్మో.. ఈ హిప్పో బెదిరింపు మామూలుగా లేదుగా.. వాహనాన్ని వెంబడించి మరీ.. చివరకు..

ABN , Publish Date - Dec 10 , 2024 | 09:18 PM

అడవి జంతువులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. శాంతంగా ఉండే జంతువుల బీభత్సం సృష్టించండి.. క్రూరంగా కనిపించే జంతువులు అనూహ్యంగా శాంతంగా కనిపించడం జరుగుతుంటుంది. ఏనుగులు, నీటి ఏనుగులు సాధారణంగా శాంతంగా కనిపిస్తుంటాయి. అయితే..

Viral Video: వామ్మో.. ఈ హిప్పో బెదిరింపు మామూలుగా లేదుగా.. వాహనాన్ని వెంబడించి మరీ.. చివరకు..

అడవి జంతువులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. శాంతంగా ఉండే జంతువుల బీభత్సం సృష్టించండి.. క్రూరంగా కనిపించే జంతువులు అనూహ్యంగా శాంతంగా కనిపించడం జరుగుతుంటుంది. ఏనుగులు, నీటి ఏనుగులు సాధారణంగా శాంతంగా కనిపిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఏనుగులు ఆగ్రహంతో హల్‌చల్ చేస్తుంటాయి. అయితే నీటి ఏనుగులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఓ నీటి ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వాహనాన్ని వెంబడించి మరీ అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) మన్యోని ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రైడ్‌కు వెళ్లిన కొందరు పర్యాటకులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. కొందరు పర్యాటకులు వాహనంలో ఫారెస్ట్ రైడ్‌కు వెళ్లారు. లోపల జంతువులను చూస్తూ సరదాగా గడుపుతుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఓటమి చెందామని తెగ బాధపడిపోతున్నారా.. అయితే ఒక్కసారి ఇతడి కష్టాన్ని చూడండి..


రోడ్డు పక్కనే ఉన్న ఓ నీటి ఏనుగును వారంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. అయితే పర్యాటకులను చూడగానే నీటి ఏనుగుకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. వెంటనే వారి వాహనంపైకి (hippo attacks tourist's vehicle) దాడికి దిగుతుంది. హిప్పో తమ మీదకు రావడం చూసి పర్యాటకులు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతారు. అయినా హిప్పో వారిని వదలకుండా వెంట పడుతుంది. వాహనం దగ్గరికి వెళ్లిన హిప్పో.. ఒక్కసారిగా నోరు తెరచి కొరికేయాలని చూస్తుంది.

Viral Video: వావ్.. ఈ కోతి ఆటలు మామూలుగా లేవుగా.. ఇంటిపైకి ఎక్కి ఏం చేస్తుందో చూడండి..


అయితే ఆ వెంటనే వాహనాన్ని మరింత వేగంగా నడపడంతో ప్రమాదం తప్పిపోయింది. ఇలా నీటి ఏనుగును నుంచి తృటిలో తప్పించుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ నీటి ఏనుగు ఆవేశం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘స్వీట్ వార్నింగ్ ఇచ్చిన హిప్పో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 19 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పండ్లు ఎక్కువగా కొంటున్నారా.. ఈ బండిపై గబ్బిలం చేస్తున్న పని చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 10 , 2024 | 09:18 PM