Share News

Viral Video: వామ్మో.. ఇది రియలా, లేక గ్రాఫిక్సా.. ఆవు ఇలా చేసిందేంటీ..

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:30 AM

ఎంతవరకూ నిజమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పశువుల పాకలో కొన్ని ఆవులు మేత మేస్తుంటాయి. ఇంతలో కొన్ని కోళ్లు అటుగా వెళ్తాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Viral Video: వామ్మో.. ఇది రియలా, లేక గ్రాఫిక్సా.. ఆవు ఇలా చేసిందేంటీ..

సోషల్ మీడియాలో అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు గేదెలు, ఎద్దులు మిగతా జంతువులపై దాడి చేయడం చూస్తుంటాం. అయితే ఆవులు మాత్రం సహనానికి ప్రతీకగా ఉంటాయి. మిగతా జంతువులపై కానీ, మనుషులపై గానీ దాడి చేసిన సందర్భాలు చాలా చాలా అరుదనే చెప్పాలి. అయితే తాజాగా, ఓ ఆవు విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సమీపానికి వచ్చిన కోడిపై ఆవు దాడి చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఆవు ఇలా చేసిందేంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఎంతవరకూ నిజమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పశువుల పాకలో కొన్ని ఆవులు మేత మేస్తుంటాయి. ఇంతలో కొన్ని కోళ్లు అటుగా వెళ్తాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా శాంతంగా ఉన్న ఓ ఆవుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్నట్లుంది.

Viral Video: చీరలో సింపుల్‌గా ఉన్నా.. టాలెంట్ మామూలుగా లేదుగా.. పామును ఎలా పట్టేసిందో చూడండి..


సమీపానికి వచ్చిన కోడిని ఒక్కసారిగా కొరికేసింది. దాని తలను (cow bit chicken) పట్టుకుని కొరుకుతూనే ఉంది. దీంతో పక్కన ఉన్న కోళ్లన్నీ చెల్లాచెదురుగా పారిపోయాయి. ఆ కోడిని ఆవు చాలా సేపు అలా కొరుకుతూనే కనిపించింది. అక్కడున్న ఓ వ్యక్తి ఈ ఘటన చూసి షాక్ అయ్యాడు. వెంటనే తన ఫోన్‌తో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: ఈ కోడి పుంజు భక్తి మామూలుగా లేదుగా.. దేవుడి ఎదురుగా నిలబడి మరీ..


అయితే ఈ వీడియో చూసిన వారంతా ఇది ఫేక్ అని చెబుతున్నారు. ‘‘ఇదంతా తప్పుడు ప్రచారం.. వీడియోను ఎడిట్ చేశారు’’.. అంటూ కొందరు, ‘‘అంతలా నములుతుంటే రక్తస్రావం కావాలి కదా.. ఇది ఎడిట్ చేసిందని అర్థమవుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కెమెరాను ఎత్తుకెళ్లిన సింహం.. రికార్డైన వీడియో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 22 , 2024 | 11:30 AM