Share News

Viral Video: ఈ కోడి పుంజు భక్తి మామూలుగా లేదుగా.. దేవుడి ఎదురుగా నిలబడి మరీ..

ABN , Publish Date - Dec 22 , 2024 | 10:06 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. జగన్నాథ స్వామి దేవుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరంచి, ఎదురుగా పూలు, ప్రసాదం పెట్టి పూజలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది..

Viral Video: ఈ కోడి పుంజు భక్తి మామూలుగా లేదుగా.. దేవుడి ఎదురుగా నిలబడి మరీ..

కొన్నిసార్లు జంతువులు, పక్షులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తించడం ద్వారా అందరికీ కనువిప్పు కలిగిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు మనుషులు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌‌గా మారుతుంటాయి. అలాంటి ట్రెండింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ కోడిపుంజు దేవుడి ఎదురుగా చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ కోడి పుంజు భక్తి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జగన్నాథ స్వామి (Lord Jagannath) దేవుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరంచి, ఎదురుగా పూలు, ప్రసాదం పెట్టి పూజలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అటుగా వచ్చిన కోడి పుంజు (hen) .. సరాసరి దేవుడి విగ్రహం వద్దకు వెళ్లింది. అక్కడున్న ఆహార పదార్థాలను తింటుందేమో అని అక్కడున్న వారంతా అనుకున్నారు.

Viral Video: కారును ధ్వంసం చేసి ప్రియుడిని లాక్కెళ్లిన దండగులు.. చివరికి ప్రియురాలికి షాకింగ్ సర్‌ప్రైజ్..


అయితే అందుకు విరుద్ధంగా ఆ కోండి పుంజు దేవుడి ఎదురుగా నిలబడి, తల కిందకు వచ్చి (hen praying to God) నమస్కారాలు చేస్తున్నట్లుగా ప్రవర్తించింది. చాలా సేపు అలాగే నిలబడి దేవుడిని ప్రార్థించినట్లుగా కనిపించింది. తర్వాత అక్కడి నుంచి మెల్లగా పక్కకు వెళ్లిపోతుంది. దేవుడి ఎదురుగా ఉన్న ఆహార పదార్థాలను ముట్టకుండా.. ఇలా నమస్కారం చేస్తున్నట్లుగా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Viral Video: బాలిక బౌలింగ్‌కు సచిన్ ఫిదా.. వీడియోను షేర్ చేస్తూ ఏమన్నారంటే..


ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం’’.. అంటూ కొందరు, ‘‘దేవుడిని ఆరాధించడానికి జంతువులు, పక్షులు ఆరాపడుతుంటే.. మనుషులకు మాత్రం తీరిక దొరకడం లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లు, 2.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కెమెరాను ఎత్తుకెళ్లిన సింహం.. రికార్డైన వీడియో చూస్తే.. షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 22 , 2024 | 10:06 AM