Share News

Viral Video: కెమెరాను ఎత్తుకెళ్లిన సింహం.. రికార్డైన వీడియో చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Dec 22 , 2024 | 09:53 AM

జంతువులపై భయంకరంగా దాడి చేసే సింహాలను చూస్తుంటాం. మనుషులతో స్నేహంగా మెలిగే సింహాలను చూస్తుంటాం. అలాగే తన పిల్లలతో సరదాగా గడిపే సింహాలను కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: కెమెరాను ఎత్తుకెళ్లిన సింహం.. రికార్డైన వీడియో చూస్తే.. షాకవ్వాల్సిందే..

జంతువులపై భయంకరంగా దాడి చేసే సింహాలను చూస్తుంటాం. మనుషులతో స్నేహంగా మెలిగే సింహాలను చూస్తుంటాం. అలాగే తన పిల్లలతో సరదాగా గడిపే సింహాలను కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ సింహం విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం విచిత్రంగా కెమెరాను ఎత్తుకెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో పర్యటిస్తున్న టూరిస్టులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. వాహనంలో నుంచి సింహాన్ని వీడియో తీస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కెమెరాను గమనించిన సింహం.. చివరకు మెల్లగా దాని వద్దకు వచ్చేస్తుంది. చూస్తుండగానే కెమెరా (lion stole the camera) స్టిక్‌ను నోట కరుచుకుని పారిపోతుంది.

Viral Video: బాలిక బౌలింగ్‌కు సచిన్ ఫిదా.. వీడియోను షేర్ చేస్తూ ఏమన్నారంటే..


ఆ సమయంలో కెమెరా ఆన్‌లోనే ఉండడంతో మొత్తం రికార్డ్ అయింది. కెమెరా స్టిక్‌ను నోటితో పట్టుకున్న సింహం.. చాలా దూరం వరకూ పరుగెడుతూ వెళ్లింది. మధ్యలో స్టిక్‌ను మరో చోట పట్టుకుని మళ్లీ చాలా దూరం వరకూ పరుగెడుతుంది. చివరకు ఓ గడ్డి పొదలో కెమెరాను వదిలేసి వెళ్లిపోతుంది. దాని వెనుకే వాహనంలో వెళ్లిన వారు.. చివరకు తమ కెమెరాను తీసేసుకుంటారు.

Viral Video: కారును ధ్వంసం చేసి ప్రియుడిని లాక్కెళ్లిన దండగులు.. చివరికి ప్రియురాలికి షాకింగ్ సర్‌ప్రైజ్..


కాగా, ఇందులో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహం సెల్ఫీ షూటింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ సింహం వెరైటీగా ఉన్నట్టుందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3500కి పైగా లైక్‌లు, 1.36 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇదేం విన్యాసంరా బాబోయ్.. మూర్ఖత్వానికి పరాకష్ట అంటే ఇదేనేమో..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 22 , 2024 | 09:53 AM