Share News

Viral video: ఫొటో దిగడానికి వచ్చిన వరుడి స్నేహితులు.. చివరకు వధువునే సైడ్ చేసి..

ABN , Publish Date - Jun 22 , 2024 | 08:02 PM

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు అనుకోకుండా విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు వినూత్నంగా ప్లాన్ చేస్తుంటారు. మొత్తానికి...

Viral video: ఫొటో దిగడానికి వచ్చిన వరుడి స్నేహితులు.. చివరకు వధువునే సైడ్ చేసి..

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు అనుకోకుండా విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు వినూత్నంగా ప్లాన్ చేస్తుంటారు. మొత్తానికి వివాహానికి సంబంధించిన ఏ వీడియో అయినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. వీటిలో కొన్ని వీడియోలైతే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరుడితో ఫొటో దిగడానికి వచ్చిన స్నేహితులు.. చివరకు వధువును కూడా సైడ్ చేసి ఏం చేశారో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో ఉన్నట్టుండి తమాషా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు (bride and groom) వేదికపై ఉండగా.. బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా ఒకరి తర్వాత ఒకరుగా పైకి వచ్చి ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వరుడి స్నేహితులంతా ఒకే సారి వేదికపైకి వచ్చారు. ఒకరు తర్వాత ఒకరుగా వారు వేదిక పైకి వచ్చి వరడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వరుసగా నిలబడ్డారు.

Viral video: వాడకం అంటే ఇదీ.. పక్కన పడేసిన ఫ్యాన్ గార్డ్‌తో.. యువతి జుట్టును ఎలా మార్చాడంటే..


వరుడి స్నేహితులంతా వచ్చి వరుసగా నిలబడడంతో వధువు దూరంగా జరగాల్సి వచ్చింది. అయితే చాలా మంది అలా వరుసగా వరుడి పక్కనే నిలబడడంతో వధువు స్టేజీ చివరకు వెళ్లిపోయింది. ఇంతటితో ఆగని వరుడి స్నేహితులు.. ఫొటో తీయాలని చెప్పి ఆమె చేతిలో ఓ స్టార్ట్ ఫోన్ పెడతారు. వారి చేష్టలకు ఖంగుతిన్న వధువు.. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ తీసుకుని (bride took photo groom and his friends) వారందరికీ ఫొటో తీస్తుంది.

Viral video: గుండెల్ని పిండేసే వీడియో.. మందలిస్తున్న మావటిని.. ఈ ఏనుగు చివరకు..


వరుడు, అతడి స్నేహితులంతా మాట్టాడుకుని ఇది కావాలని చేసినట్లు కనిపిస్తున్నా.. వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వధువుకు ఇరిటేషన్ వచ్చింది.. కానీ బలవంతంపు స్మైల్‌‌తో దాన్ని కవర్ చేసింది’’.. అంటూ కొందరు, ‘‘వధువు చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది... గ్రేట్’’.. అంటూ మరికొందరు, ‘‘ఏదో రోజు వధువు ఖచ్చితంగా రివేంజ్ తీసుకుంటుందేమో’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: రాత్రివేళల్లో గేదెలు మేయడానికి వీలుగా.. ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 22 , 2024 | 08:02 PM