Share News

Viral video: తలపైనే ఏసీ.. ఎండ నుంచి తప్పించుకోవడానికి ఇతడు చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Jun 22 , 2024 | 07:39 PM

వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు వినూత్న వాహనాలను తయారు చేస్తుంటే.. మరికొందరు...

Viral video: తలపైనే ఏసీ.. ఎండ నుంచి తప్పించుకోవడానికి ఇతడు చేసిన పని చూస్తే..

వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు వినూత్న వాహనాలను తయారు చేస్తుంటే.. మరికొందరు విచిత్ర వంటకాలు చేయడం చూశాం. అలాగే ఇంకొందరు ఎండ వేడి నుంచి బయటపడేందుకు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం కూడా చూశాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అతి తెలివిగా ఆలోచించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి తలపైనే ఏసీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చివరకు విచిత్ర ప్రయోగం చేశాడు. సెలూన్ షాపులోకి వెళ్లిన అతను.. చివరకు తలపై మంచు టోపీ (Snow cap) పెట్టించుకున్నాడు. తలపై ఉన్న వెంట్రుకలను కవర్ చేస్తూ.. మొత్తం ఐస్ ముద్ద కవర్ చేసినట్లుగా ఉంది.

Viral video: గుండెల్ని పిండేసే వీడియో.. మందలిస్తున్న మావటిని.. ఈ ఏనుగు చివరకు..


చూసేందుకు ఇది విచిత్రమైన టోపీలా కనిపిస్తోంది. ఇతడు ధరించిన మంచు టోపీ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఈ మంచు టోపీ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: రాత్రివేళల్లో గేదెలు మేయడానికి వీలుగా.. ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 22 , 2024 | 07:39 PM