Share News

Viral Video: నిద్ర లేచీ లేవగానే టీ కావాలని అరిచాడు.. అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Dec 27 , 2024 | 04:15 PM

సినిమా తరహా కామెడీ సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చూస్తుంటాం. అప్పుడప్పుడూ సినిమా సీన్లకు మించిన ఘటనలు చోటు చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సీన్లు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు విభిన్నంగా ఆలోచిస్తూ స్క్రిప్ట్‌లు రాసుకుంటుంటారు. చివరకు ..

Viral Video: నిద్ర లేచీ లేవగానే టీ కావాలని అరిచాడు.. అటువైపు నుంచి వచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..
Grandson and Grandma Funny Videos

సినిమా తరహా కామెడీ సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చూస్తుంటాం. అప్పుడప్పుడూ సినిమా సీన్లకు మించిన ఘటనలు చోటు చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సీన్లు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు విభిన్నంగా ఆలోచిస్తూ స్క్రిప్ట్‌లు రాసుకుంటుంటారు. చివరకు ఇలాంటి వీడియోలన్నీ కలిసి సోషల్ మీడియాలోకి చేరి నెటిజన్లకు వినోదాన్ని పంచుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు నిద్ర లేచీ లేవగానే టీ కావలంటూ గట్టిగా అరిచాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇంటి బయట పడుకున్న ఓ యువకుడు.. చాలా ఆలస్యంగా నిద్రలేస్తాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా నవ్వుకునే ఘటన చోటు చేసుకుంది. నిద్ర లేచిన అతను.. ఆ వెంటనే టీ కావాలంటూ గట్టిగా కేకలు వేస్తాడు. అయితే అప్పటికే ఆలస్యంగా నిద్రలేవడంతో అతడి అమ్మమ్మ సీరియస్‌గా ఉంది.

Viral Video: వీధుల్లోకి చొరబడ్డ సింహం.. పరుగులు తీసిన జనం.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఆలస్యంగా లేవడమే కాకుండా టీ కావాలని అరవడంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ‘‘మీ నాన్న ఇక్కడి టీ షాపు పెట్టాడునుకున్నావా’’.. అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ (grandmother throws empty water tank on her grandson) ఖాళీ ప్లాస్టిక్ నీళ్ల ట్యాంకును అతడి పైకి విసురుతుంది. ఆ ట్యాంక్ ఒక్కసారిగా అతడిపై పడడంతో షాక్ అవుతాడు. ఉరుకు పరుగుగున పైకి లేచి దూరంగా పారిపోతాడు. ‘‘అనవరంగా టీ అడిగి తప్పు చేశానే’’.. అంటూ తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతాడు. అమ్మమ్మ, మనువడికి మధ్య ఇలా తమాషా సంఘటన చోటు చేసుకుందన్నమాట.

Viral Video: హీరోలా పల్టీలు కొట్టాలని చూశాడు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..


అయితే ఇదంతా నవ్వుకోవడం కోసం కావాలని ప్లాన్ చేసినా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అమ్మమ్మను టీ అడిగి పెద్ద తప్పే చేశాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ బామ్మ చాలా డేంజర్‌లా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 84 వేలకు పైగా లైక్‌లు, 3.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అడవి దున్నతో పెట్టుకున్న సింహం.. చివరికి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2024 | 04:16 PM