Share News

Viral Video: వీధుల్లోకి చొరబడ్డ సింహం.. పరుగులు తీసిన జనం.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Dec 26 , 2024 | 09:55 PM

అడవి జంతువులు అప్పుడప్పుడూ జనావాసాల్లోకి చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. గ్రామాల్లోకి చొరబడే ఏనుగులు, పులులు, సింహాలు.. మనుషులు, జంతువులపై దాడి చేయడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు..

Viral Video: వీధుల్లోకి చొరబడ్డ సింహం.. పరుగులు తీసిన జనం.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

అడవి జంతువులు అప్పుడప్పుడూ జనావాసాల్లోకి చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. గ్రామాల్లోకి చొరబడే ఏనుగులు, పులులు, సింహాలు.. మనుషులు, జంతువులపై దాడి చేయడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ సింహానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం అడవి నుంచి వీధిలోకి రావడంతో జనం పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ సింహం అటవీ ప్రాంతం నుంచి (lion entering the village) గ్రామంలోకి చొరబడింది. సింహాన్ని చూసిన జనం భయంతో పరుగులు తీశారు. అంతా వారి వారి ఇళ్లపైకి ఎక్కేశారు. అయితే వీధిలోకి చొరబడ్డ సింహం.. అటూ, ఇటూ పరుగులు పెడుతూ ఆహారం కోసం వెతికింది. మధ్యలో కాలు జారి ధబేల్‌మని కిందపడుతుంది. మళ్లీ పైకి లేచి పరుగులు తీస్తుంది.

Viral Video: హీరోలా పల్టీలు కొట్టాలని చూశాడు.. చివరికి జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ క్రమంలో ఓ ఇంట్లోకి వెళ్లేందుకు తలుపులు బద్ధలుకొట్టాలని కూడా ప్రయత్నించింది. అయితే అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి మరో వీధిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కూరగాయల బండి తోసుకుంటున్న వ్యక్తి ఎదురుగా వస్తుంటాడు. అయితే సింహాన్ని చూసి ఆ వ్యక్తి ఎంతో తెలివిగా బండి చాటుగా దాక్కుంటూ పక్కకు వెళ్లిపోతాడు. అతన్ని గమనించకుండా నేరుగా మరో వీధిలోకి వెళ్లిపోయిన సింహం.. అటు నుంచి అటే ఇంకో ప్రాంతం వైపు పారిపోతుంది. సింహాన్ని చూసిన వీధి కుక్కలు.. దాని వెనుకే వెళ్లి మొరగడం కూడా చూడొచ్చు.

Viral Video: అడవి దున్నతో పెట్టుకున్న సింహం.. చివరికి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇళ్ల పైకి ఎక్కిన వారంతా ఈ సింహాన్ని వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అడవులను నరికేయడం వల్లే ఇలా జరుగుతోంది’’.. అంటూ కొందరు, ‘‘వీధి కుక్కలకు భయపడి పారిపోయిన సింహం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 590కి పైగా లైక్‌లు, 50 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అరే..! ఏంటీ విచిత్రం.. మొత్తానికి మెడికల్ స్టోర్స్‌ను సంతలా మార్చారుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 26 , 2024 | 09:55 PM