Viral Video: ఈ చీమల తెలివి చూస్తే ముక్కున వేసేసుకుంటారు... పజిల్‌ను ఎలా పూర్తి చేశాయంటే..
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:10 PM
Watch video: పల్లెటూరిలోని గుడిసె మొదలకొని పట్టణాల్లోని భవంతుల వరకూ చీమ లేని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల తదితర విషయాలలో మనుషులకు చీమలు ఆదర్శంగా నిలుస్తుంటాయి. అలాగే అత్యంత తెలివిగా ప్రవర్తించడంలోనూ చీమలకు మించినవి మరోటి ఉండవు. విచిత్రంగా ప్రవర్తించే చీమలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
పల్లెటూరిలోని గుడిసె మొదలకొని పట్టణాల్లోని భవంతుల వరకూ చీమ లేని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల తదితర విషయాలలో మనుషులకు చీమలు ఆదర్శంగా నిలుస్తుంటాయి. అలాగే అత్యంత తెలివిగా ప్రవర్తించడంలోనూ చీమలకు మించినవి మరోటి ఉండవు. విచిత్రంగా ప్రవర్తించే చీమలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, చీమలన్నీ కలిసి పజిల్‌ను ఎంతో తెలివిగా పూర్తి చేసిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా చీమలన్నీ (ants) కలిసి టీ ఆకారంలోని వస్తువును మొసుకెళ్తుంటాయి. అయితే మధ్యలో వాటికి పెద్ద సమస్య వచ్చి పడుతుంది. పజిల్ (Puzzle) తరహాలో అడ్డుగోడలు ఎదురవుతాయి. వాటి మధ్యలో గ్యాప్ కొంచెం మాత్రమే ఉంటుంది. ఆ గ్యాప్‌లోనే ఆ వస్తువును దాటించుకుని తీసుకెళ్లాలి. అయితే మొదటి అది సాధ్యం కాదు.
అయినా ఆ చీమలు నిరాణ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించి ఎంతో చాకచక్యంగా ఆ వస్తువును ముందుకు తీసుకెళ్తాయి. అయితే ఆ తర్వాత వాటికి మళ్లీ మరో అడ్డు గోడ ఎదురవుతుంది. దాన్నుంచి కూడా చీమలు అంతే తెలివిగా ఆ వస్తువును దాటించి బయటికి తీసుకెళ్తాయి. చిన్న చిన్న ఓటమి ఎదురైతేనే మనుషులు ఎంతో కుంగిపోతుంటారు. జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను దాటుకుని, లక్షాన్ని ఎలా చేరుకోవాలనే విషయాన్ని ఈ చీమలు చేసి చూపించాయి.
Viral Video: దర్జాగా చోరీ చేయడం అంటే ఇదేనేమో.. రోడ్డు మధ్యలో వీళ్ల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
ఈ చీమల తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు. కొందరు ఇది గ్రాఫిక్స్ అంటుండగా.. మరికొందరు చీమలు నిజంగా కూడా ఇలాంటి తెలివితేటలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చీమల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వావ్.. ఈ చీమల చేసిన పని చాలా అద్భుతంగా ఉంది’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 33వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..