Share News

Viral Video: అడవి దున్నతో పెట్టుకున్న సింహం.. చివరికి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..

ABN , Publish Date - Dec 26 , 2024 | 08:13 PM

అడవి జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరిగితే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు జరుగుతుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా పులులు, సింహాల దాడి సమయంలో చోటు చేసుకుంటుంటాయి. వేటాడే సమయంలో సింహాలకు కొన్ని జంతువులు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: అడవి దున్నతో పెట్టుకున్న సింహం.. చివరికి ఏమైందో చూస్తే.. అవాక్కవుతారు..

అడవి జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరిగితే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు జరుగుతుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా పులులు, సింహాల దాడి సమయంలో చోటు చేసుకుంటుంటాయి. వేటాడే సమయంలో సింహాలకు కొన్ని జంతువులు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం అడవి దున్నపై దాడి చేయాలని చూసింది. అయితే చివరకు దాని పరిస్థితి చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అనవసరంగా అడవి దున్నతో పెట్టుకుందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో జంతువులను చూడటానికి వెళ్లిన పర్యాటకులకు షాకింగ్ సీన్ కనిపిస్తుంది. రోడ్డుపైకి దూసుకొచ్చిన ఓ సింహం.. సడన్‌గా (Lion attack on wild buffalo) ఓ అడవి దున్నపై దాడి చేస్తుంది. దాని మెడ పట్టుకున్న సింహం... ఎలాగైనా ఊపిరిరాడకుండా చేసి తినేయాలని చూస్తుంది. సింహం దాడితో షాకైన అడవిదున్న ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది.

Viral Video: దర్జాగా చోరీ చేయడం అంటే ఇదేనేమో.. రోడ్డు మధ్యలో వీళ్ల నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..


కానీ సింహం మాత్రం దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇలా చాలా సేపటి తర్వాత అడవి దున్న పైచేయి సాధిస్తుంది. సింహాన్ని కాళ్లతో తొక్కుతూ.. అటూ, ఇటూ తిప్పుతూ గట్టిగా విదిలిస్తుంది. ఈ పోటీలో అలసిపోయిన సింహం.. చివరకు అడవిదున్నను (lion that ran away from wild buffalo) విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత అడవి దున్న కూడా అదే వైపు వేగంగా పారిపోతుంది. అయినా సింహం మాత్రం దాన్ని వదిలేసి.. ‘బతుకు జీవుడా’.. అనుకుంటూ దూరంగా వెళ్లిపోతుంది.

Viral Video: ఈ చీమల తెలివి చూస్తే ముక్కున వేసేసుకుంటారు... పజిల్‌ను ఎలా పూర్తి చేశాయంటే..


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అడవి దున్న పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అడవికి రాజైనా అడవిదున్నకు తక్కువే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లు, 5.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అరే..! ఏంటీ విచిత్రం.. మొత్తానికి మెడికల్ స్టోర్స్‌ను సంతలా మార్చారుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 26 , 2024 | 08:13 PM