Viral Video: ఏనుగు గూండాగిరి.. రోడ్డుపై వాహనాలను బలవంతంగా ఆపి మరీ..
ABN , Publish Date - Dec 10 , 2024 | 05:01 PM
ఏనుగులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. కొన్నిసార్లు అంతే బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు అంతే ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల దారుల్లో రోడ్లపై దౌర్జన్యం చేసే ఏనుగులను చూస్తుంటాం. ఇలాంటి ..
ఏనుగులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. కొన్నిసార్లు అంతే బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు అంతే ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల దారుల్లో రోడ్లపై దౌర్జన్యం చేసే ఏనుగులను చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు రోడ్డు పైకి వచ్చి గూండాగిరీ చేసింది. రోడ్డుపై వాహనాలను బలవంతంగా ఆపి మరీ అది చేసిన నిర్వాకం ఏంటో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన శ్రీలంకలో (Sri Lanka) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అటవీ ప్రాంతం నుంచి రోడ్డు పైకి వచ్చిన ఏనుగు (elephant on the road) ఆహారం కోసం వాహనాలను బలవంతంగా ఆపేసింది. కొందరు భయంతో ఆపకుండా ఎలాగోలా తప్పించుకుని వెళ్లారు. దీంతో ఏనుగు చిర్రెత్తుకొచ్చి చివరకు ఏకంగా వాహనాల ఎదరుగా వెళ్లి నిలబడింది.
Viral Video: మెట్లు దిగడానికి బద్ధకించి భవనం పైనుంచి దూకేసిన పిల్లి.. చివరికి ఎవరూ ఊహించని సీన్..
ఈ క్రమంలో ఓ బస్సును కూడా ఇలాగే ఆపింది. అయితే ఏనుగును చూసి సమస్యను అర్థం చేసుకున్న ప్రయాణికులు బ్రెడ్లు, అరటిపండ్లు, మొక్కజొన్న తదితరాలను దానికి అందించారు. ఇలా ఆ ప్రయాణికులు ఇచ్చిన పండ్లన్నింటినీ తాపీగా తినేసింది. ఇలా వచ్చీపోయే వాహనాలన్నింటినీ ఆపుతూ వారు ఇచ్చే ఆహార పదార్థాలను తింటూ ఉందన్నమాట.
Optical illusion: ఈ చిత్రంలో ఆమెతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి.. 15 సెకన్లలో కనుక్కంటే మీరే తోపు..
ఈ వీడియో ప్రస్తుతంస సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టోల్ గేట్ పెట్టిన ఏనుగు’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఏనుగు రౌడీయిజం మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 లక్షలకు పైగా లైక్‌లు, 41.5 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చిరుత పులితో కుక్క పోరాటం.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..