Share News

Viral Video: చిరుత పులితో కుక్క పోరాటం.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:45 PM

జనావాసాల్లోకి చొరబడే పులులు, సింహాలు కొన్నిసార్లు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువులపై దాడి చేసి అందరినీ హడలెత్తిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా..

Viral Video: చిరుత పులితో కుక్క పోరాటం.. చివరకు జరిగింది చూస్తే షాకవ్వాల్సిందే..

జనావాసాల్లోకి చొరబడే పులులు, సింహాలు కొన్నిసార్లు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువులపై దాడి చేసి అందరినీ హడలెత్తిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరుత పులితో ఓ కుక్క బతుకుపోరాటం చేసింది. చివరకు ఏం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి పెరట్లో వారి పెంపుడు కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ చిరుత పులి సడన్‌గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. కుక్కను చూసి మెల్లగా దాని (leopard attacked a pet dog) వద్దకు వెళ్లి ఒక్కసారిగా మెడ పట్టుకుని చంపే ప్రయత్నం చేస్తుంది.

Viral Video: మెట్లు దిగడానికి బద్ధకించి భవనం పైనుంచి దూకేసిన పిల్లి.. చివరికి ఎవరూ ఊహించని సీన్..


చిరుత పులి దాడితో షాక్ అయిన కుక్క.. దాన్నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా చిరుత పులి దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. మరోవైపు కుక్క ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో చివరకు చిరుత పులి ఒక్కసారిగా కుక్కను వదిలేసి అక్కడి నుంచి పారిపోతుంది. కుక్క మొరిగిన శబ్ధాలు విని దాని యజమానికి గేటు తీసుకుని బయటికి వస్తుంది. చివరకు కుక్కను ఇంట్లోకి తీసుకెళ్లి గేటు మూసేస్తుంది.

Viral Video: అయ్యో తాతా.. ఎంత పని జరిగింది.. ఎద్దును తరిమికొట్టాలని చూడగా..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తోకముడిచిన చిరుత పులి’’.. అంటూ కొందరు, ‘‘అడవులను నరికేస్తుండడంతో ఇలా జరుగుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌‌లు, 27.6 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ట్రిక్ ఎప్పుడైనా ట్రై చేశారా.. చేతి నుంచి గాజులను ఎలా తీస్తుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 10 , 2024 | 03:45 PM