Share News

Viral video: మేడపై పని చేస్తుండగా షాకింగ్ ఘటన.. పొరపాటున ఆమె సబ్బుపై కాలేయడంతో..

ABN , Publish Date - Jun 25 , 2024 | 08:50 PM

కొందరు ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అంతవరకూ బాగా ఉన్న వారు అంతలోనే క్షతగాత్రులుగా మారడమో, లేక ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. కొందరు..

Viral video: మేడపై పని చేస్తుండగా షాకింగ్ ఘటన.. పొరపాటున ఆమె సబ్బుపై కాలేయడంతో..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అంతవరకూ బాగా ఉన్న వారు అంతలోనే క్షతగాత్రులుగా మారడమో, లేక ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. కొందరు ప్రమాదాలకు గురవడానికి గల కారణాలు చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ మేడపై పని చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పొరపాటున ఆమె సబ్బుపై కాలేయడంతో చివరకు చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని (Bangalore) హెబ్బాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య రుబియాతో కలిసి స్థానిక ఆర్కే ప్యాలెస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇదిలావుండగా, రుబియా ఇటీవల ఓ రోజు తమ అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై పాత్రలను శుభ్రం చేస్తోంది. ఆ సమయంలో ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral video: సిమెంట్ మూటను ఇలా ఎవరైనా ఎత్తగలరా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..


పాత్రలు శుభ్రం చేసే క్రమంలో రుబియా.. పొరపాటున సబ్బుపై అడుగుపెట్టింది. దీంతో ఒక్కసారిగా జారుకుంటూ వెళ్లి చివరకు బిల్డింగ్ చివర అంచుకు వచ్చేసింది. కింద పడే క్రమంలో టెర్రస్ రెయిలింగ్‌ను పట్టుకుంది. ఆమెను పైకి లాగేందుకు భర్త ఎంతగానో ప్రయత్నించాడు. భార్య చేతులు పట్టుకుని పైకి లాగాలని చూసినా సాధ్యం కాలేదు. ఈ ఘటనతో కింద ఉన్న వారంతా గుంపులుగా గుమికూడారు. మరోవైపు భర్త తన భార్యను అలాగే పట్టుకుని ఉన్నాడు. అయితే చివరకు చేతులు జారిపోయి.. ఆమె ఒక్కసారిగా (woman fell from the top of building) కింద పార్క్ చేసి ఉన్న బైకులపై పడిపోయింది.

Viral video: పెళ్లి భోజనంలో కనిపించని చికెన్ లెగ్ పీస్.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఈ ఘటనతో కింద ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరకు ఆమెను ఎత్తుకుని ఓ ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న డీజే హళ్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘అంతా చూస్తున్నారే గానీ.. సాయం చేసే ప్రయత్నం చేయలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: ఒంట్లో శక్తి లేకున్నా సింహాలకు ఎదురుగా వెళ్లి భయపెట్టిన హైనా.. చివరకు ఏం జరిగిందో చూడండి..

Updated Date - Jun 25 , 2024 | 08:50 PM