Share News

Viral video: ఒంట్లో శక్తి లేకున్నా సింహాలకు ఎదురుగా వెళ్లి భయపెట్టిన హైనా.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Jun 25 , 2024 | 07:16 PM

పులులు, సింహాలు, హైనాలు.. సాధారణంగా ఒకదానిపై ఇంకొకటి దాడులు చేసుకోవు. అయితే ఆహార వేటలో విధిలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సింహాలు పులలుపై..

Viral video: ఒంట్లో శక్తి లేకున్నా సింహాలకు ఎదురుగా వెళ్లి భయపెట్టిన హైనా.. చివరకు ఏం జరిగిందో చూడండి..

పులులు, సింహాలు, హైనాలు.. సాధారణంగా ఒకదానిపై ఇంకొకటి దాడులు చేసుకోవు. అయితే ఆహార వేటలో విధిలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సింహాలు పులలుపై, హైనాలు సింహాలపై దాడులు చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వయసు మీద పడ్డ ఓ హైనా ఓపిక లేకున్నా సింహాల ఎదురుగా వెళ్లి భయపెట్టాలని చూసింది. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అడవి మధ్యలోని రోడ్డుపై రెండు సింహాలు ఆహారం కోసం వెతుకుతుంటాయి. అయినా వాటికి ఎలాంటి వేట చిక్కకపోవడంతో ఆకలితో ఓపిగ్గా వెతుకుతుంటాయి. ఈ క్రమంలో వయసు మీద పడ్డ ఓ హైనా అటుగా వస్తుంది. సింహాల తనను ఏమీ చేయలేవనే ఉద్దేశంతో వాటి సమీపానికి వెళ్లి భయపెట్టాలని చూస్తుంది. అప్పటికే ఆకలితో ఉన్న సింహాలు.. హైనాను చూడగానే ( lions attacked the hyena) నేరుగా వెళ్లి దానిపై దాడికి దిగుతాయి.

Viral video: సింహం గాఢ నిద్రలో ఉండగా.. దగ్గరికి వెళ్లిన జింక పిల్ల.. అటూ ఇటూ చూసి చివరకు..


చూస్తుండగానే హైనాను పంజాతో మట్టి కరిపిస్తాయి. ఇంతలో మరో రెండు పెద్ద సింహాలు కూడా హైనాను తినేస్తాయి. ఈ ఘటనను అక్కడే వాహనాల్లో ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తు్న్నారు. ‘‘వృద్ధాప్యంలో జంతువులకూ ఇబ్బందులు తప్పడం లేదు’’.. అంటూ కొందరు, ‘‘సింహాల ముందుకు ధైర్యంగా వెళ్లిన హైనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: వివాహానికి ముందు వింత ఒప్పందం.. పెళ్లి తర్వాత కోరిక తీర్చలేకపోయిన భర్త.. చివరకు..

Updated Date - Jun 25 , 2024 | 07:16 PM