Viral Video: నీ టాలెంట్‌కు హ్యట్సాప్ బ్రదర్.. రంపం మిషిన్‌తో ఇతడు చేసిన విన్యాసం చూస్తే..
ABN , Publish Date - Dec 19 , 2024 | 09:55 AM
కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ఆశ్చర్యం కలగడంతో పాటూ అనితర సాధ్యం అనికూడా అనిపిస్తుంటుంది. ఎవరూ చేయలేని పనులను కొందరు ఎంతో సులభంగా చేసేస్తుంటారు. చాలా మంది ఇలాంటి..
కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అయితే ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ఆశ్చర్యం కలగడంతో పాటూ అనితర సాధ్యం అనికూడా అనిపిస్తుంటుంది. ఎవరూ చేయలేని పనులను కొందరు ఎంతో సులభంగా చేసేస్తుంటారు. చాలా మంది ఇలాంటి వినూత్న విన్యాసాలు చేస్తూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం కూడా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రంపం మిషిన్‌తో చేసిన విన్యాసం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘నీ టాలెంట్‌కు హ్యట్సాప్ బ్రదర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రంపం మిషిన్‌తో వినూత్న విన్యాసం (Innovative stunt) చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఓ వ్యక్తి తన నోటిలో దోసకాయ (Cucumber) పెట్టుకుని ఉండగా.. మరో వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని, చేతిలో రంపం మిషిన్‌తో (Chain Saw Machine) అక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నాడబ్బా.. అని చూసేలోగానే అంతా షాక్ అయ్యేలా వినూత్న విన్యాసం చేసి చూపించాడు.
Viral Video: ఈ ఏనుగుకు పద్ధతి కూడా తెలుసు.. దారి మధ్యలో వ్యక్తి అడ్డుగా ఉండడంతో..
రంపం మిషిన్‌ను ఆన్ చేసి, దోసకాయను కట్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను కిందకు వంగి నోటిలో దోసకాయను పట్టుకుని ఉండగా.. కళ్లకు గంతలు కట్టుకుని ఉన్న వ్యక్తి ఆ దోసకాయను ఎంతో చాకచక్యంగా ముక్కలు చేస్తున్నాడు. దోసకాయను చివరి వరకూ ఇలా కట్ చేస్తూ వెళ్లాడు. చివరి ముక్కను కట్ చేస్తే ఆ వ్యక్తికి గాయాలవుతాయి. కానీ వ్యక్తి మాత్రం అతడికి మిషిన్ తాకకుండా ఎంతో నైపుణ్యంతో దోసకాయలను కత్తిరిస్తాడు. ఇలా ఒక్క నిముషంలో మొత్తం 71 ముక్కలు చేసి గిన్నిస్ బుక్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
Viral Video: వామ్మో.. భయానక ప్రమాదం నుంచి ఈమెలా బయటపడిందో చూడండి..
ఈ వీడియోను గిన్నిస్ రికార్డ్స్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఇతడి టాలెంట్ అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.. ఇలాంటి విన్యాసం అనితరసాధ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 13.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: నీటిపై ఎగురుతున్న డ్రోన్.. నీటి నుంచి పైకొచ్చిన మొసలి.. చివరికి షాకింగ్ ట్విస్ట్..
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..