Share News

Viral video: గుండెల్ని పిండేసే వీడియో.. మందలిస్తున్న మావటిని.. ఈ ఏనుగు చివరకు..

ABN , Publish Date - Jun 22 , 2024 | 04:58 PM

ఎంతో సహనంగా ఓపిగ్గా కనిపించే జంతువలు కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఆవులు, గేదెలు, ఎద్దులు, ఏనుగులు తదితర జంతువులు సాధారణంగా ఎంతో శాంతంగా కనిపిస్తుంటాయి. అయితే...

Viral video: గుండెల్ని పిండేసే వీడియో.. మందలిస్తున్న మావటిని.. ఈ ఏనుగు చివరకు..

ఎంతో సహనంగా ఓపిగ్గా కనిపించే జంతువలు కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. ఆవులు, గేదెలు, ఎద్దులు, ఏనుగులు తదితర జంతువులు సాధారణంగా ఎంతో శాంతంగా కనిపిస్తుంటాయి. అయితే వాటికి ఆగ్రహం వచ్చిన సందర్భాల్లో హల్‌చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో జంతువులు, మనుషులపై దాడులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి విషాదకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మందలిస్తున్న మావటిపై ఓ ఏనుగు దాడి చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కేరళలోని (Kerala) అడిమాలికి సమీపంలోని కల్లార్‌ ప్రాంతంలో జూన్ 20న ఈ ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులను సఫారీకి తీసుళ్లందుకు ఈ ప్రాంతంలో చాలా ఏనుగులను సిద్ధం చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణన్ (60) అనే మావటి.. ఓ ఏనుగు వద్దకు వెళ్లి సక్రమంగా నిలబడుకునేలా శిక్షణ ఇస్తున్నాడు. చేతిలోని కర్రతో ఏనుగు కాళ్లపై సున్నితంగా కొడుతూ ఏనుగు సరిగ్గా నిలబడేలా సూచిస్తున్నాడు.

Love Story: స్నేహితుడు పిలిచాడని ఆస్పత్రికి వెళ్లాడు.. రాత్రికి రాత్రే అమ్మాయిగా మారాడు.. చివరకు..


అయితే ఈ క్రమంలో ఏనుగుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకంది. వెంటనే మావటిపై దాడికి దిగింది. కింద పడేసి అతడిపై (elephant Trampling mahout with the feet) కాళ్లు మోపి బలంగా తొక్కింది. అంతటితో ఆగకుండా అతడి వీపుపై కూడా కాళ్లు మోపి తొక్కడంతో మావటి.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగు దాడి చేయడాన్ని గమనించిన ఇంకో వ్యక్తి పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అయితే అప్పటికే బాలకృష్ణన్ మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral video: నీళ్లలో నడుస్తుండగా షాకింగ్ సీన్.. రాయిలా మెరుస్తూ ఉండడంతో కాలితో తొక్కి చూడగా..


ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందించారు. ఏనుగులను సఫారీకి అక్రమంగా తరలిస్తున్నారని తేలడంతో సదరు సఫారీ కేంద్రాన్ని మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ జిల్లాలో చాలా ఏనుగు సఫారీ కేంద్రాలకు అనుమతి లేనట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘చాలా బాధాకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: వాడకం అంటే ఇదీ.. పక్కన పడేసిన ఫ్యాన్ గార్డ్‌తో.. యువతి జుట్టును ఎలా మార్చాడంటే..

Updated Date - Jun 22 , 2024 | 04:58 PM