Viral video: వాడకం అంటే ఇదీ.. పక్కన పడేసిన ఫ్యాన్ గార్డ్‌తో.. యువతి జుట్టును ఎలా మార్చాడంటే..
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:06 PM
ఎందుకూ పనికి రావనుకున్న వస్తువులను కొందరు చిత్రవిచిత్రమైన పనుల కోసం వినియోగిస్తుంటారు. అందులోనూ వారి ప్రత్యేకతను చూపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షి్స్తుంటారు. ఇలాంటి...
ఎందుకూ పనికి రావనుకున్న వస్తువులను కొందరు చిత్రవిచిత్రమైన పనుల కోసం వినియోగిస్తుంటారు. అందులోనూ వారి ప్రత్యేకతను చూపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షి్స్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పక్కన పడేసిన ఫ్యాన్ గార్డ్‌తో ఓ వ్యక్తి యువతి జుట్టును అందంగా మార్చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వాడకం అంటే ఇదీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. ఓ సెలూన్ (Salon) నిర్వాహకుడు హెయిర్ కటింగ్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ యువతి తన జుట్టును (young women haircut) స్టైల్‌గా మార్చుకునేందుకు సెలూన్‌కు వెళ్లింది. సెలూన్ నిర్వాహకుడు.. ముందుగా ఆమె తలపై టేప్ బ్యాండ్ పెట్టి జుట్టును అందులో నుంచి బయటికి బయటికి లాగేశాడు. ఆ తర్వాత టేప్ బ్యాండ్‌పై పక్కన పడేసిన ఫ్యాన్ గార్డ్‌ను (Fan guard) పెడతాడు. జుట్టును ఫ్యాన్ గార్డ్‌పై గుండ్రంగా పరిచేస్తాడు.
Love Story: స్నేహితుడు పిలిచాడని ఆస్పత్రికి వెళ్లాడు.. రాత్రికి రాత్రే అమ్మాయిగా మారాడు.. చివరకు..
ఫైనల్‌గా ఫ్యాన్ గార్డ్ చుట్టూ వేలాడుతున్న జుట్టును క్రమ పద్ధతిలో కత్తిరిస్తాడు. ఇలా ఆమె జుట్టును సమాంతరంగా కత్తించింది అందంగా మార్చేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ సెలూన్ నిర్వాహకుడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఫ్యాన్ గార్డ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral video: నీళ్లలో నడుస్తుండగా షాకింగ్ సీన్.. రాయిలా మెరుస్తూ ఉండడంతో కాలితో తొక్కి చూడగా..