Share News

Viral video: స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతను తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jun 19 , 2024 | 07:14 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది వ్యూస్, లైక్‌లే లక్ష్యంగా వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చేస్తే చిరాకు వస్తుంటుంది. మరికొందరు చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి...

Viral video: స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతను తెలివి మామూలుగా లేదుగా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది వ్యూస్, లైక్‌లే లక్ష్యంగా వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చేస్తే చిరాకు వస్తుంటుంది. మరికొందరు చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్నానం చేసిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కాలువ ఒడ్డున నిలబడ్డ ఓ వ్యక్తి స్నానం చేయాలని అనుకుంటాడు. అయితే కాలువలోకి దిగకుండానే రోడ్డుపైనే స్నానం (bath) చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం అతను చివరకు అక్కడే ఉన్న జేసీబీ (JCB) వాహనం సాయం తీసుకంటాడు. జేసీబీ డ్రైవర్ బకెట్‌ను కాలువ నీటిలో ముంచి, తర్వాత ఆ నీటిని మొత్తం రోడ్డు పైన ఉన్న వ్యక్తిపై పోస్తాడు.

Viral video: సముద్రం ఒడ్డున ప్రేమికుల సరసాలు.. వద్దంటున్నా యువతి బలవంతంగా చేసిన పనికి..


ఇలా చాలా సార్లు ఇనుప బకెట్‌తో అతడికి స్నానం చేస్తాడు. ఇలా అక్కడున్న వారంతా జేసీబీని వాడుకుని స్నానం చేసేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘జేసీబీని ఇంతకంటే ఎవరూ వాడలేరేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: రైల్లో పవర్ బ్యాంక్ కొన్న వ్యక్తి.. అనుమానం వచ్చి తెరచి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Jun 19 , 2024 | 07:14 PM