Viral video: సముద్రం ఒడ్డున ప్రేమికుల సరసాలు.. వద్దంటున్నా యువతి బలవంతంగా చేసిన పనికి..
ABN , Publish Date - Jun 19 , 2024 | 04:02 PM
కొందరు ప్రేమికులు ప్రమాకరమైన స్థితిలోనూ సరసాలు ఆడుతూ చివరకు తాము ఇబ్బంది పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదాల్లో నెట్టేస్తుంటారు. బైకులపై వెళ్తూ కొందరు, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లపై మరికొందరు...
కొందరు ప్రేమికులు ప్రమాకరమైన స్థితిలోనూ సరసాలు ఆడుతూ చివరకు తాము ఇబ్బంది పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదాల్లో నెట్టేస్తుంటారు. బైకులపై వెళ్తూ కొందరు, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లపై మరికొందరు అసభ్యకరంగా ప్రవర్తించడం చూశాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరగడం కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ప్రేమ జంట సముద్రం ఒడ్డున సరసాలు ఆడుతోంది. ఈ క్రమంలో యువతి బలవంతంగా చేసిన పనికి.. చివరకు దారుణం జరిగింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రష్యాలోని (Russia) సోచి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట (Lovers) జూన్ 16వ తేదీన స్థానికంగా ఉన్న సముద్రం వద్దకు వెళ్లారు. సముద్రం (Sea) ఒడ్డున అలల మధ్యలో సరదాగా గడుపుతుండగా.. షాకింగ్ ఘటన చోట చేసుకుంటుంది. అలలు ఉదృతంగా వస్తున్నా వారిద్దరూ అక్కడే నిలబడి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో యువతి అతన్ని మరింత లోపలికి లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.
Viral video: హీరోలను మించిపోయాడుగా.. పామును నడుముకు చుట్టేసి మరీ..
అతను వద్దు.. వద్దు.. అంటున్నా ఆమె బలవంతంగా ఇంకాస్త లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరూ నిలబడి ముద్దులు (kisses) పెట్టుకుంటారు. ఈ సమయంలో ఓ పెద్ద అల వచ్చి వారి మీద పడుతుంది. దీంతో వారిద్దరూ మరింత లోపలికి కొట్టుకుపోతారు. అయితే యువకుడు మాత్రం ఎలాగోలా ఒడ్డుకు వస్తాడు. అయితే యువతి మాత్రం (woman washed up in the sea) అందులో కొట్టుకుపోతుంది. దీంతో షాక్ అయిన ఆ వ్యక్తి తన ప్రియురాలిని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో ఎంతో ప్రయత్నిస్తాడు. అయినా అప్పటికే ఆమె చాలా లోపలికి కొట్టుకుపోవడంతో అతడికి సాధ్యం కాదు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని యువతి కోసం గాలించారు. అయినా అలల ఉదృతి ఎక్కువగా ఉండడంతో వారి వల్ల కూడా సాధ్యం కాదు. సముద్రంలో కొట్టుకుపోయిన యువతి కోసం మూడు రోజులుగా వారు గాలిస్తూనే ఉన్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..