Share News

Viral video: సంబరంగా ఈత కొడుతుండగా సడన్‌గా స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకిన పులి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Jun 18 , 2024 | 07:13 PM

పులులు, సింహాలను చూస్తే జంతువులైనా.. మనుషులైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిందే. జనావాసాల్లోకి ప్రవేశించే పులులు ప్రజలు భయభ్రాంతాలకు గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి...

Viral video: సంబరంగా ఈత కొడుతుండగా సడన్‌గా స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకిన పులి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

పులులు, సింహాలను చూస్తే జంతువులైనా.. మనుషులైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిందే. జనావాసాల్లోకి ప్రవేశించే పులులు ప్రజలు భయభ్రాంతాలకు గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న ఇలాంటి వీడియోచూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతా సంబరంగా ఈత కొడుతుండగా.. ఓ పులి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ స్విమ్మింగ్ పూల్‌లో చాలా మంది సంతోషంగా ఈత కొడుతుంటారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద పులి సడన్‌గా (tiger jumped into swimming pool) స్విమ్మింగ్ పూల్‌లోకి దూకుతుంది. పులిని గమనించని కొందరు అటువైపు తిరిగి ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో పులి అత్యంత సమీపానికి వస్తుంది. పులి దగ్గరికి రావడం చూసిన ఒక్కొక్కరు అలెర్ట్ అవుతారు.

Viral video: ఛీఛీ.. ఫుల్‌గా మందు కొట్టి కుక్కతో సరసాలాడిన మందుబాబు.. చివరకు..


అయితే వారిలో ఓ వ్యక్తి సడన్‌గా పులిని చూసి భయంతో అక్కడి నుంచి బయటికి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. వేగంగా వెళ్లే క్రమంలో ధబేల్‌మని కిందపడి జారుకుంటూ వెళ్తాడు. ఈ ఘటన చూసి చుట్టూ ఉన్న వారంతా నవ్వుకుంటారు. టైనర్ల పర్యవేక్షణలో పులిని ఇలా వదిలారని తెలుస్తున్నప్పటికీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పులి అందరినీ బాగా నవ్వించిందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ పులికి స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: రజనీకాంత్ రోబోకు షాకిచ్చిన స్టూడెంట్.. ఇతను చేసిన పని చూస్తే..

Updated Date - Jun 18 , 2024 | 07:13 PM