Share News

Viral video: హీరోలను మించిపోయాడుగా.. పామును నడుముకు చుట్టేసి మరీ..

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:35 PM

విష సర్పాలను చూడగానే సాధారణంగా ఎవరైనా కాళ్లకు బుద్ధి చెబుతారు. అయితే కొందరు మాత్రం వాటిలో పరాచకాలు ఆడుతుంటారు. మరికొందరు ..

Viral video: హీరోలను మించిపోయాడుగా.. పామును నడుముకు చుట్టేసి మరీ..

విష సర్పాలను చూడగానే సాధారణంగా ఎవరైనా కాళ్లకు బుద్ధి చెబుతారు. అయితే కొందరు మాత్రం వాటిలో పరాచకాలు ఆడుతుంటారు. మరికొందరు మందుబాబులు వాటిని ఏకంగా మెడలో వేసుకుని అందరి ముందూ హీరోల్లా బిల్డప్ ఇస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ మందుబాబు పామును నడుముకు చుట్టుకుని మరీ వినూత్నంగా వ్యవహరించాడు. ఈ వీడియోను చూసిన వారంతా ‘‘ఇతనెవరోగానే.. హీరోలనే మించిపోయాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఏపీలోని కడప జిల్లా (Kadapa District) జమ్మలమడుగులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మందు తాగి రోడ్డుపై వస్తున్న ఓ వ్యక్తి్కి పాము కనిపిస్తుంది. పామును చూడగానే కొంచెం కూడా భయపడకుండా దాన్ని చేతిలోకి తీసుకంటాడు. అంతటితో ఆగకుండా ఏకంగా దాన్ని తన నడుముకు (man wrapped the snake around waist) బెల్టులా చుట్టేసుకుంటాడు. నడుముకు గట్టిగా చుడ్డడంతో పాము ఏటూ వెళ్లలేక పైకి, కిందకు పాకుతూ ఉంటుంది. ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా తాపీగా (smoking) బీడీ నోట్లో పెట్టుకుని వెలిగిస్తాడు.

Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..


ఆ తర్వాత అంతే కూల్‌గా పాము తలను తన అరచేతిపై పెట్టుకుని ప్రేమగా లాలిస్తాడు. అయినా పాము అతడిపై బుసలు కొట్టకుండా కామ్‌గా ఉంటుంది. ఇలా చాలా సేపు అతను పాముతో ఆడుకుంటూ కనిపిస్తాడు. ఇతడి చేష్టలు చూసి రోడ్డుపై వెళ్లే వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడు రజనీకాంత్‌ను మించిపోయాడుగా’’.. అంటూ కొందరు, ‘‘మందు పవర్ అలాంటిది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: సంబరంగా ఈత కొడుతుండగా సడన్‌గా స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకిన పులి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Jun 18 , 2024 | 10:52 PM