Share News

Viral: రజనీకాంత్ రోబోకు షాకిచ్చిన స్టూడెంట్.. ఇతను చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Jun 18 , 2024 | 06:01 PM

హీరోయిన్ పరీక్ష రాస్తుండగా.. రోబో తనకు వినూత్న రీతిలో సాయం చేస్తుంది. ఎగ్జామ్ సెంటర్ భవనం పైనుంచి తన కంటి ద్వారా లేజర్ షో వేసి, తద్వారా పరీక్ష సులభంగా రాసేలా సహకరిస్తుంది. ఇది...

Viral: రజనీకాంత్ రోబోకు షాకిచ్చిన స్టూడెంట్.. ఇతను చేసిన పని చూస్తే..

హీరోయిన్ పరీక్ష రాస్తుండగా.. రోబో తనకు వినూత్న రీతిలో సాయం చేస్తుంది. ఎగ్జామ్ సెంటర్ భవనం పైనుంచి తన కంటి ద్వారా లేజర్ షో వేసి, తద్వారా పరీక్ష సులభంగా రాసేలా సహకరిస్తుంది. ఇది రజనీకాంత్ రోబో సినిమాలోని సీన్. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. ఓ విద్యార్థి ఇంతకంటే హైటెట్‌గా చీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పరీక్ష హాల్లో ఇతను చేసిన పని చూసి చివరకు పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. టర్కీలో (Turkey) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతంలో గ్రాడ్యుయేషన్ (Graduation) కోసం నిర్వహించిన బేసిక్ ప్రొఫిషియన్సీ పరీక్షకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి మాస్ కాపీయింగ్ (Mass copying) చేసేందుకు అందరిలా స్లిప్పులు కాకుండా వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. అది కూడా ఎంతలా అంటే టెక్నాలజీలో అనుభవం ఉన్న వారు కూడా ఆశ్చర్యపోయేంతలా ప్లాన్ చేశాడు.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..


ఇందుకోసం అతను తన బూట్లలో ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసిన రూటర్‌ను ఏర్పాటు చేశాడు. అలాగే క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లో అత్యంత చిన్న స్మార్ట్ ఫోన్‌ను (small smart phone) సెట్ చేశాడు. అదేవిధంగా షర్ట్ బటన్‌లో హై డెఫినిషన్ కెమెరాతో పాటూ చెవిలో చిన్న హెడ్‌సెట్ ధరించాడు. ఇలా మొత్తం సెట్ చేసుకున్న అతను.. పేపర్‌లో ప్రశ్నలను స్కాన్ చేసిన తర్వాత ఏఐ టెక్నాలజీ (AI technology) సాయంతో ఫోన్ ద్వారా సమాచారం తీసుకుని, దాన్ని హెడ్‌‌సెట్ ద్వారా వింటాడన్నమాట. ఇతడి తెలివితేటలు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.

Viral video: ఛీఛీ.. ఫుల్‌గా మందు కొట్టి కుక్కతో సరసాలాడిన మందుబాబు.. చివరకు..


ఎవరికీ అనుమానం రాకుండా విద్యా్ర్థి మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా టీచర్లు పసిగట్టడంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. పరీక్షల్లో ఇలాంటి పనులు చేయడం టర్కీలో తీవ్రమైన నేరంగా పరిగిస్తారు. దీంతో ఈ విద్యార్థికి కఠిన శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ విద్యార్థి తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ శ్రద్ధ చదువుపై పెడితే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉండదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..

Updated Date - Jun 18 , 2024 | 06:01 PM