Viral Video: బైకుపై ప్రియురాలితో విచిత్ర విన్యాసం.. కాస్త దూరం వెళ్లగానే ఖంగుతిన్న ప్రియుడు.. చివరకు..
ABN , Publish Date - Dec 12 , 2024 | 10:25 AM
ప్రస్తుత సమాజంలో చాలా మంది యువతీ యువకులు చేతిలో బైక్ ఉంటే చాలు.. చుట్టూ ఎవరున్నారనే విషయాన్ని కూడా పట్టించుకోరు. ఇక బైకుపై అమ్మాయి ఉందంటే ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. మరికొందరు ప్రియురాళ్లను బైకుపై ఎక్కించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. ఇంకొందరు..
ప్రస్తుత సమాజంలో చాలా మంది యువతీ యువకులు చేతిలో బైక్ ఉంటే చాలు.. చుట్టూ ఎవరున్నారనే విషయాన్ని కూడా పట్టించుకోరు. ఇక బైకుపై అమ్మాయి ఉందంటే ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. మరికొందరు ప్రియురాళ్లను బైకుపై ఎక్కించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. ఇంకొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి బైకుపై ప్రియురాలిని ట్యాంకుపై కూర్చోబెట్టుకుని విచిత్ర విన్యాసం చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బైకుపై ప్రియురాలిని (Girlfriend on bike) ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఇందులో ఎలాంటి విచిత్రం లేకున్నా.. మధ్యలో అతను చేసిన నిర్వాకంతో అంతా అవాక్కయ్యారు. అంత వరకూ వెనుక కూర్చున్న ప్రియురాలిని.. మధ్యలో బైకు ఆపి ముందు ట్యాంక్ మీద ఎదురెదురుగా కూర్చోబెట్టుకున్నాడు. ఇలా అసభ్యకర రీతిలో బైకుపై వెళ్తుండడం చూసి చుట్టూ ఉన్న వాహనదారులు అవాక్కయ్యారు.
Viral Video: మందు పవరా.. మజాకా.. రైలింజన్‌కు ఎదురెళ్లిన మందుబాబు.. చివరకు జరిగింది చూస్తే..
అయితే ఇలా ఆ వ్యక్తి కొంచెం దూరం వెళ్లగానే సడన్‌గా పోలీసులు (police) బైకును ఆపేశారు. ఆమెను కిందకకు దింపేసి, బైకు తాళాలు తీసుకున్నారు. ఇలా ప్రియురాలితో అసభ్యకర రీతిలో బైక్ డ్రైవింగ్ చేసిన ఇతడికి పోలీసులు షాక్ ఇచ్చారన్నమాట. అతడి వెనుకే కారులో వెళ్తు్న్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియోను చూసిన చాలా మంది.. ఇది వ్యూస్ కోసం కావాలని చేసినట్లుగా ఉందని అంటున్నారు.
Viral Video: సముద్ర నీటిలో ఈత కొడుతున్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన టైగర్ షార్క్.. చివరకు..
అయినా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా.. చాలా ఫన్నీగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలా అసభ్యకరంగా ప్రవర్తించేవారికి భారీ జరిమానా విధించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. చలికాలంలో వేడి నీటి స్నానం కోసం ఇతను చేసిన పని చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..