Share News

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. చలికాలంలో వేడి నీటి స్నానం కోసం ఇతను చేసిన పని చూడండి..

ABN , Publish Date - Dec 12 , 2024 | 08:49 AM

చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వివిధ రకాల సమస్యలకు చాలా మంది అతి తెలివిగా పరిష్కార మార్గాలు వెతుకుతుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివిగా చేసే ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి..

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. చలికాలంలో వేడి నీటి స్నానం కోసం ఇతను చేసిన పని చూడండి..

చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వివిధ రకాల సమస్యలకు చాలా మంది అతి తెలివిగా పరిష్కార మార్గాలు వెతుకుతుంటారు. ఈ క్రమంలో కొందరు అతి తెలివిగా చేసే ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చలికాలంలో వేడి నీటి స్నానం చేసేందుకు విచిత్ర ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చలికాలంలో (winter) ఇళ్లలో వెచ్చగా ఉండేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. కొందరు పడుకునే ముందు వెచ్చగా ఉండేందుకు మంచం కింద నిప్పు కుంపటి పెడుతుండగా.. మరికొందరు చిత్రవిచిత్రంగా ఆలోచించడం కూడా చూశాం. తాజాగా, ఓ యువకుడు వేడి నీటి స్నానం (Hot water bath) చేసేందుకు ఎవరూ చేయని విధంగా వింత ఏర్పాట్లు చేశాడు.

Viral Video: మందు పవరా.. మజాకా.. రైలింజన్‌కు ఎదురెళ్లిన మందుబాబు.. చివరకు జరిగింది చూస్తే..


కొళాయి నీటిని వేడి చేసేందుకు ఏకంగా ఓ కొవ్వొత్తిని (candle) తగిలించాడు. కొళాయికి కింద వైపు కొవ్వొత్తిని వేలాడదీశాడు. దాన్ని వెలిగించగా ఆ వేడి కొళాయికి తగిలి.. తద్వారా వేడి నీరు బయటికి వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. చివరగా అందులో నుంచి వచ్చే వేడి నీటితో స్నానం ముగించేశాడన్నమాట. ఇలా వేడి నీటి కోసం ఇతను చేసిన విచిత్రమైన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: ప్రమాదానికి గురైన బైకర్‌ను చూసి కారు ఆపాడు.. ఆ వెంటనే జరిగిన ఘటనతో ఖంగుతిన్నాడు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది అల్ట్రా ప్రో వాటర్ హీటర్‌లా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి తెలివితేటలన్నీ ఇండియాలోనే సాధ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 38.8 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చిరుత పులులకు చుక్కలు చూపించిన నక్క.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2024 | 08:49 AM