Share News

Viral Video: సముద్ర నీటిలో ఈత కొడుతున్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన టైగర్ షార్క్.. చివరకు..

ABN , Publish Date - Dec 12 , 2024 | 09:30 AM

సముద్ర ప్రయాణం వింత అనుభూతిని కలిగిస్తుంది. అలాగే కొన్నిసార్లు భయానక పరిస్థితులను కూడా కల్పిస్తుంది. ఎటువైపు నుంచి ఏ తిమింగళమో లేదా షార్క్ చేపలో వచ్చి దాడి చేస్తాయో తెలీని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా..

Viral Video: సముద్ర నీటిలో ఈత కొడుతున్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన టైగర్ షార్క్.. చివరకు..

సముద్ర ప్రయాణం వింత అనుభూతిని కలిగిస్తుంది. అలాగే కొన్నిసార్లు భయానక పరిస్థితులను కూడా కల్పిస్తుంది. ఎటువైపు నుంచి ఏ తిమింగళమో లేదా షార్క్ చేపలో వచ్చి దాడి చేస్తాయో తెలీని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి సముద్ర నీటిలో ఈత కొడుతుండగా.. సడన్‌గా ఓ టైగర్ షార్క్ చేప దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మాల్దీవుల్లోని (Maldives) చినీ ఖోటాఖోర్ ప్రాంతంలో ఈ ఘటచ చోటు చేసుకుంది. ఇక్కడి సముద్ర తీరంలో ఓ యువతి స్కూబా డైవింగ్ చేసేందుకు వెళ్లింది. సముద్ర లోతులో అందాలను వీక్షిస్తూ ఈత కొడుతుండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద టైగర్ షార్క్ చేప ఈదుకుంటూ అటుగా వచ్చింది.

Viral Video: మందు పవరా.. మజాకా.. రైలింజన్‌కు ఎదురెళ్లిన మందుబాబు.. చివరకు జరిగింది చూస్తే..


యువతిని చూడగానే వేగంగా దగ్గరికి వచ్చి (Tiger shark attacks young woman) దాడి చేయబోయింది. తలను కొరికే ప్రయత్నం చేయగా.. ఆ యువతి వెంటనే అలెర్ట్ అయి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు తలకు అయిన గాయానికి సుమారు 40 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. అంత పెద్ద ప్రమాదం నుంచి యువతి ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: ప్రమాదానికి గురైన బైకర్‌ను చూసి కారు ఆపాడు.. ఆ వెంటనే జరిగిన ఘటనతో ఖంగుతిన్నాడు..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రదేశాల్లో స్కూబా డైవింగ్ చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఈ చేప నుంచి తప్పించుకోవడం అసాధ్యం.. ఈమె టైం ఎంతో బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30వేలకు పైగా లైక్‌‌లు, 9.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. చలికాలంలో వేడి నీటి స్నానం కోసం ఇతను చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2024 | 09:30 AM