Share News

Viral video: ఛీఛీ.. ఫుల్‌గా మందు కొట్టి కుక్కతో సరసాలాడిన మందుబాబు.. చివరకు..

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:37 PM

మద్యం మత్తులో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు గేదెలకు ఎదురుగా వెళ్లి భయపెట్టే ప్రయత్నం చేస్తే.. ఇంకొందరు వాహనాలను ఆపుతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి..

Viral video: ఛీఛీ.. ఫుల్‌గా మందు కొట్టి కుక్కతో సరసాలాడిన మందుబాబు.. చివరకు..

మద్యం మత్తులో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు గేదెలకు ఎదురుగా వెళ్లి భయపెట్టే ప్రయత్నం చేస్తే.. ఇంకొందరు వాహనాలను ఆపుతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫుల్‌గా మందు కొట్టిన ఓ మందు బాబు కుక్కతో సరసాలు ఆడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి పొలంలో పడుకుని ఉంటాడు. ఇంతలో ఓ వీధి కుక్క అతడి వద్దకు వెళ్తుంది. దాన్ని చూడగానే మందుబాబుకు ఒక్కసారిగా ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. వెంటనే కుక్క తలను (drunk man kissed the dog) గట్టిగా పట్టుకుని ముద్దు పెడతాడు. ఇలా పదే పదే దానికి ముద్దులు పెడుతూ, కాళ్లు మొక్కుతూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తాడు. అయినా కుక్క మాత్రం ఏమీ అనకుండా అలాగే ఓపిగ్గా ఉంటుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..


అయితే అతడి చేష్టలు ఎక్కవ కావడతో చివరకు దానికి విసుగొచ్చినట్లుంది. ‘‘ఈ మందుబాబుతో ఎందుకొచ్చిన గొడవ.. ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే సేఫ్’’.. అని అనుకున్నట్లుగా అక్కడి నుంచి చల్లగా జారుకుంటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది నిషా పవర్ అంటే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేయడం ప్రమాదకరం’’... అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 74వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: బీచ్‌లో యువతి విచిత్ర నిర్వాకం.. చివరకు ఎలాంటి షాక్ తగిలిందో చూడండి..

Updated Date - Jun 18 , 2024 | 04:37 PM