Share News

Viral video: కుక్క పిల్లను చుట్టేసిన పాము.. ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో.. చివరకు..

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:06 PM

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాము దాడి చేసే విధానం చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. జంతువులపై..

Viral video: కుక్క పిల్లను చుట్టేసిన పాము.. ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో.. చివరకు..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాము దాడి చేసే విధానం చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. జంతువులపై మెరుపుదాడులు చేసి మట్టు పెట్టే పాములను చూస్తుంటాం. తాజాగా, ఓ పాము కుక్క పిల్లపై అటాక్ చేసింది. దాన్నుంచి తప్పించుకునేందుకు కుక్క పిల్ల ఎంతో ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము కుక్క పిల్లపై (Snake attack on puppy) అటాక్ చేస్తుంది. కుక్క పిల్లను చుట్టేసిన పాము చివరకు దాన్ని మెడను కూడా చుట్టేసి ఊపిరాడకుండా చేసింది. ఊహించని ఈ దాడితో కుక్క పిల్ల షాక్ అయింది. దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా అది సాధ్యం కాకపోవడంతో అలాగే పోరాడుతూ ఉంది. ఈ క్రమంలో పాము ఎక్కడ కాటేసి, కుక్క పిల్లను చంపేస్తుందేమో అని అంతా భయపడతారు.

Viral video: అరెరే.. ఇలా జరిగిందేంటీ.. దంపతులు రిక్షాలో కూర్చోగానే.. నడుపుదామని చూస్తే..


అయితే చివరకు అక్కడే ఉన్న ఓ వ్యక్తి కుక్క పిల్ల వద్దకు వచ్చి పామును తీసేస్తాడు. అయితే ఈ వీడియో చూస్తుంటే వ్యూస్ కోసం వారు కావాలనే పామును కుక్క పిల్లకు చుట్టేసినట్లు అనిపిస్తోంది. ఏదిఏమైనా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జంతువులను హింసించడం నేరం’’.. అంటూ కొందరు, ‘‘పామును బలవంతంగా కుక్కపిల్లకు చుట్టేసినట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..

Updated Date - Jun 16 , 2024 | 04:06 PM