Share News

Viral Video: సర్జరీ చేస్తుంటే.. ఏమాత్రం భయం లేకుండా.. చివరకు వైద్యులకే షాక్ ఇచ్చాడుగా..

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:31 PM

ఆస్పత్రుల్లో సర్జరీలు జరిగే సమయంలో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు వైద్యులు రోగులకు ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేయడం, వీడియోలు చూపిస్తూ ఆపరేషన్లే చేయడం చూశాం. అయితే...

Viral Video: సర్జరీ చేస్తుంటే.. ఏమాత్రం భయం లేకుండా.. చివరకు వైద్యులకే షాక్ ఇచ్చాడుగా..

ఆస్పత్రుల్లో సర్జరీలు జరిగే సమయంలో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు వైద్యులు రోగులకు ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేయడం, వీడియోలు చూపిస్తూ ఆపరేషన్లే చేయడం చూశాం. అయితే మరికొన్నిసార్లు రోగులు వైద్యులకు షాక్ ఇస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం కూడా చూస్తుంటాం. ఆపరేషన్ సమయంలో ఓ గర్భిణి దేవుడి పాటలు పాడి వైద్యులను ఆశ్చర్యపరచడం చూశాం. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సర్జరీ జరుగుతుండగా ఓ రోగి నిర్వాకం చూసి వైద్యులు అవాక్కయ్యారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు (Doctors) రోగికి సర్జరీ (surgery) చేస్తుంటారు. అయితే ఓ వైపు వైద్యులు ఆపరేషన్ చేస్తుంటే.. మరోవైపు రోగి విచిత్రంగా ప్రవర్తించాడు. అక్కడ ఏమీ జరగలేదు అన్నట్లుగా.. ఫోన్‌లో గేమ్ (patient playing video game) ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ వైపు రోగి ఫోన్‌లో వీడియో గేమ్ ఆడుతుంటే.. మరోవైపు వైద్యులు అతడికి ఆపరేషన్ విజయంతంగా పూర్తి చేశారు.

Viral Video: వరుడి నిర్వాకం చూసి సిగ్గుపడ్డ వధువు.. పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ వీడియో ప్లే చేయగానే..


అయితే ఈ క్రమంలో రోగి ఎలాంటి భయం లేకుండా ఫోన్‌లో గేమ్ ఆడడం చూసి వైద్యులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘అనస్థీషియా ఎవరినీ నొప్పి కలిగించదు’’.. అనే క్యాప్షన్ ఇస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆపరేషన్ జరుగుతుందనే భయమే కనిపించలేదు’’.. అంటూ కొందరు, ‘‘వీడియో గేమ్స్‌తో అలా ఉంటుంది మరి’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎంత సెంటిమెంట్ సాంగ్ అయితే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా.. తేనెతుట్టెలో తల పెట్టి మరీ..

Updated Date - Jul 09 , 2024 | 09:32 PM

News Hub