Share News

Viral Video: వరుడి నిర్వాకం చూసి సిగ్గుపడ్డ వధువు.. పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ వీడియో ప్లే చేయగానే..

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:03 PM

సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆఖరికి ఏ కార్యక్రమం నిర్వహించినా అందులో ఏదో ఘటన వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. ఇందులో ..

Viral Video: వరుడి నిర్వాకం చూసి సిగ్గుపడ్డ వధువు.. పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ వీడియో ప్లే చేయగానే..

సమాజంపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆఖరికి ఏ కార్యక్రమం నిర్వహించినా అందులో ఏదో ఘటన వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. ఇందులో పెళ్లిళ్ల వీడియోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది తమ వివాహాల్లో ఏదో ఒక ప్రత్యేక సందర్భం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో ప్రీవెడ్డింగ్ వీడియో చూస్తూ వధువు సిగ్గుపడిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో బంధువులతో పాటూ వధూవరులు (bride and groom) కూడా తమ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో (Pre Wedding shoot video) చూస్తుంటారు. అయితే ఈ సందర్భంగా వధువు ఒక్కసారిగా సిగ్గుపడిపోతూ పగలబడి నవ్వుకుంటుంది. వీడియోలో సినిమా తరహా సీన్లు తీసే క్రమంలో వరుడి ప్రవర్తన అందరికీ నవ్వు తెప్పించింది. సినిమాటిక్ షాట్స్ కోసం సముద్రం ఒడ్డున వధూవరులతో సాంగ్‌కు వీడియో షూట్ చేస్తారు.

Viral Video: ఎంత సెంటిమెంట్ సాంగ్ అయితే మాత్రం.. ఇలా ఎవరైనా చేస్తారా.. తేనెతుట్టెలో తల పెట్టి మరీ..


ఇంతవరకూ బాగానే ఉన్నా.. వరుడు లావుగా ఉండడంతో డాన్స్ చేసేందుకు ఇబ్బంది పడతాడు. అలాగే సాంగ్‌కు యాక్టింగ్ చేయడం వధువుకు కొత్త కావడంతో అందరికీ నవ్వు తెప్పించేలా ఉంటుంది. అలాగే వీడియోలో నటన చూసుకుని.. వధూవరులు ఇద్దరూ తెగ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కెమెరామెన్ అద్భుతంగా తీశాడు’’.. అంటూ కొందరు, ‘‘ఈ జంట చూడముచ్చటగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 75 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెద్దాయనా.. ఏంటీ పని.. స్వీట్ షాపు ఎదుట ఈ వృద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి..

Updated Date - Jul 09 , 2024 | 09:03 PM