Share News

Viral Video: డ్యూటీ టైంలో నర్సులంతా కలిసి గదిలో చేసిన వింత నిర్వాకం.. చివరకు కొందరు వీడియో తీయడంతో..

ABN , Publish Date - Jul 10 , 2024 | 04:05 PM

కొంతమంది అధికారులు, సిబ్బంది.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరైతే ఏకంగా విధుల్లోనే సరససల్లాపాలు ఆడుకుంటూ చివరకు ప్రజల్లో చులకన అవుతుంటారు. ఇలాంటి..

Viral Video: డ్యూటీ టైంలో నర్సులంతా కలిసి గదిలో చేసిన వింత నిర్వాకం.. చివరకు కొందరు వీడియో తీయడంతో..
ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది అధికారులు, సిబ్బంది.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. మరికొందరైతే ఏకంగా విధుల్లోనే సరససల్లాపాలు ఆడుకుంటూ చివరకు ప్రజల్లో చులకన అవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కొందరు నర్సులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వారు చేసిన విచిత్ర నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బహ్రైచ్‌లోని మహర్షి బాలర్క్ ఆస్పత్రిలో ఈ ఘటన చోట చేసుకుంది. ఆస్పత్రిలో (Hospital) రోజు మాదిరిగా ఆ రోజు కూడా నర్సులంతా విధులకు హాజరయ్యారు. అయితే వారిలో కొందరు నర్సులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. రోగుల బాగోగులను గాలికొదిలేసి, అంతా కలిసి ఓ గదిలో ముచ్చట్లు ఆడుకోవడం మొదలెట్టారు.

Viral Video: సర్జరీ చేస్తుంటే.. ఏమాత్రం భయం లేకుండా.. చివరకు వైద్యులకే షాక్ ఇచ్చాడుగా..


అంతటితో ఆగకుండా నర్సులంతా (Nurses playing with monkey) కలిసి ఓ కోతి పిల్లతో ఆడుకుంటూ కనిపించారు. చొక్కా తొడిగిన ఓ చిన్న కోతి పిల్ల బెంచిపై అటూ ఇటూ తిరుగుతుంటే.. నర్సులు నవ్వుకుంటూ కోతి పిల్లతో చిన్న పిల్లల తరహాలో ఆడుకుంటున్నారు. కోతి టేబుల్‌పై ఉన్న ఫైల్స్‌ను తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నా పట్టించుకోకుండా నర్సులు కోతితో ఆడుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలా విధుల్లోనే వారంతా కలిసి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన అంతా అవాక్కయ్యేలా చేస్తోంది.

Viral Video: వరుడి నిర్వాకం చూసి సిగ్గుపడ్డ వధువు.. పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ వీడియో ప్లే చేయగానే..


ఈ విషయం ఆస్పత్రి ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో విచారణ ప్రారంభించారు. నర్సులు అంజలి, కిరణ్ సింగ్, ఆంచల్ శుక్లా, ప్రియా రిచర్డ్, పూనమ్ పాండే మరియు సంధ్యా సింగ్‌‌లను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, పూర్తయ్యేవరకూ నర్సులను సస్పెండ్ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే రోగులు అవస్థలు పడుతున్నారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తెలివితక్కువ పులిని ఎప్పుడైనా చూశారా.. నీటిలో పాము అనుకుని చివరకు అది చేసిన నిర్వాకం..

Updated Date - Jul 10 , 2024 | 04:06 PM