Share News

Viral Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే జరుగుతుంది.. వంట చేస్తూ ఫోన్ చూస్తుండగా.. సడన్‌గా..

ABN , Publish Date - Dec 19 , 2024 | 10:46 AM

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా స్మార్ట్ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఫోన్ పట్టుకుంటే చాలు.. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ..

Viral Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే జరుగుతుంది.. వంట చేస్తూ ఫోన్ చూస్తుండగా.. సడన్‌గా..

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా స్మార్ట్ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఫోన్ పట్టుకుంటే చాలు.. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ వంట చేస్తున్న సమయంలోనూ ఫోన్ చూస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వంట గదిలో వంట చేస్తుంటుంది. అయితే ఆ సమయంలోనూ ఆమె స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ ఉంది. ఓ వైపు ఫోన్ చూసుకుంటూ మరోవైపు వంట చేస్తోంది. ఇలా పరధ్యానంలో వంట చేస్తుండగా.. (woman cooking while looking at the phone) మధ్యలో ఒక్కసారిగా ఆ ఫోన్ చేతిలో నుంచి జారి నూనెలో పడిపోతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది.


Viral Video: వామ్మో.. భయానక ప్రమాదం నుంచి ఈమెలా బయటపడిందో చూడండి..


ఫోన్ నూనెలో పడిపోవడంతో ( phone dropped in oil) కంగారు పడిపోయిన ఆమె.. చేతిలోని చేతిలోని గరిటతో ఫోన్‌ను బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది. ఇలా చాలా సేపు వెతికి వెతికి ఎలాగోలా ఫోన్‌ను బయటికి తీస్తుంది. మహిళ విచిత్ర నిర్వాకానికి ఆమె భర్త షాకై.. పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: నీటిపై ఎగురుతున్న డ్రోన్.. నీటి నుంచి పైకొచ్చిన మొసలి.. చివరికి షాకింగ్ ట్విస్ట్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫిష్ ఫ్రై‌లాగా ఇది ఫోన్ ఫ్రై.. అన్నమాట’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీ టాలెంట్‌కు హ్యట్సాప్ బ్రదర్.. రంపం మిషిన్‌తో ఇతడు చేసిన విన్యాసం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 19 , 2024 | 10:46 AM