Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:21 PM
ప్రస్తుతం బయటి మార్కెట్‌లో ఏ వస్తువు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి వస్తువులోనూ కల్తీ విపరీతంగా పెరిగిపోవడంతో ఏది నకిలీనో, ఏది ఒరిజినలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు..
ప్రస్తుతం బయటి మార్కెట్‌లో ఏ వస్తువు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి వస్తువులోనూ కల్తీ విపరీతంగా పెరిగిపోవడంతో ఏది నకిలీనో, ఏది ఒరిజినలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఇటీవల వైరల్ అవుతున్న వీడియోల్లో చాలా వాటిలో కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించినవే ఉన్నాయి. అప్పట్లో ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్డు అంటూ వీడియోలు తెగ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్యాబేజీ కొన్న మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) మార్కెట్‌కు వెళ్లి క్యాబేజీ (Cabbage) కొని తెచ్చింది. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దాన్ని కట్ చేసి వంట చేసే సమయంలో ఆమెకు సందేహం వచ్చినట్లుంది. దీంతో క్యాబేజీ ఆకును చేతిలోకి తీసుకుని పరిశీలించింది.
Viral Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇలాగే జరుగుతుంది.. వంట చేస్తూ ఫోన్ చూస్తుండగా.. సడన్‌గా..
తర్వాత దాన్ని స్టవ్‌పై పెట్టి కాల్చి చూసింది. చివరగా దాన్ని పరిశీలించడగా.. అది రబ్బర్‌లా సాగుతుండడంతో షాక్ అయింది. అది అసలైన క్యాబేజీ కాదని, నకిలీదంటూ ఆమె వివరించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషలో మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై అంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాబేజీ నకీలేదనని కొందరు, కాదు కాదు ఈ వీడియో ఫేక్ అంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు.
Viral Video: నీ టాలెంట్‌కు హ్యట్సాప్ బ్రదర్.. రంపం మిషిన్‌తో ఇతడు చేసిన విన్యాసం చూస్తే..
కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ప్లాస్టిక్ గుడ్డు లాగా ప్లాస్టిక్ క్యాబేజీ అన్నమాట’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: నీటిపై ఎగురుతున్న డ్రోన్.. నీటి నుంచి పైకొచ్చిన మొసలి.. చివరికి షాకింగ్ ట్విస్ట్..
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..