Share News

Viral Video: మహిళ పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. చివరికి చిన్న టెక్నిక్‌తో..

ABN , Publish Date - Aug 27 , 2024 | 07:36 PM

రైలు ప్రయాణ సమయాల్లో, రైల్వే ట్రాక్స్‌ను దాటే సమయాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. రైలు పట్టాలు దాటడం ప్రమాదమని తెలిసినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే..

Viral Video: మహిళ పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. చివరికి చిన్న టెక్నిక్‌తో..

రైలు ప్రయాణ సమయాల్లో, రైల్వే ట్రాక్స్‌ను దాటే సమయాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. రైలు పట్టాలు దాటడం ప్రమాదమని తెలిసినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం కొందరు ఆశ్చర్యకరంగా ప్రమాదం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తెలంగాణలోని (Telangana) వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఇద్దరు గిరిజన మహిళలు.. రైలు పట్టాలు దాటి అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇంతలో ఓ గూడ్స్ రైలు (goods train) అటు వైపు నెమ్మదిగా వస్తోంది. రైలు నెమ్మదిగా వస్తుండడంతో ఆ ఇద్దరు మహిళలూ పట్టాలు దాటబోయారు.

Viral Video: మిగిలిపోయిన చపాతీలతో ఇలాక్కూడా చేయొచ్చా.. ఇతడి తెలివికి హ్యాట్సాప్..


ఓ మహిళ దాటుకోగా.. మరో మహిళ (woman) సరిగ్గా పట్టాల మధ్యలో ఉంది. రైలు సమీపానికి రావడంతో ఆమె ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. వెంటనే పట్టాల మధ్యలో పడుకుంది. ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయింది. దీంతో గూడ్స్ రైలు ఆమె మీదుగా వెళ్లిపోయింది. కొందరు అక్కడే నిలబడి వీడియో తీస్తూ.. పైకి లేవకుండా అలాగే ఉండాలంటూ ఆమెకు సూచిస్తున్నారు. దీంతో ఆమె కూడా కదలకుండా అలాగే ఉండిపోయింది. ఇంతలో గూడ్స్ రైలు వెళ్లిపోగా ఆమె లేచి వచ్చేసింది.

Viral Video: బాత్రూంలో దాక్కున్న అత్యంత విషపూరిత పాము.. చివరకు అది చేసిన పని చూసి ఖంగుతిన్న స్నేక్ క్యాచర్..


ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ఎంతో తెలివిగా వ్యవహరించింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలా పట్టాలు దాటడం ఎంతో ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2024 | 07:36 PM