Share News

Viral Video: పట్టాల మధ్యలో నల్లటి ఆకారం.. రైలు ఆపి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Aug 25 , 2024 | 08:30 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు మార్గ మధ్యలో ఉండగా డ్రైవర్‌కు పట్టాల మధ్యలో దూరంగా ఏదో నల్లటి ఆకారం కనిపించింది. దీంతో అదేంటో తెలుసుకోవాలని రైలు వేగం తగ్గించాడు. చివరకు..

Viral Video: పట్టాల మధ్యలో నల్లటి ఆకారం.. రైలు ఆపి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

సోషల్ మీడియాలో వివిధ రకాల వ్యక్తుల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుండడం చూస్తుంటాం. కొందరు కేవలం నెట్టింట ఫేమస్ అవ్వడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ చేసే పనులు వీడియోల రూపంలో నెటిజన్లకు వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైలు పట్టాల మధ్యలో దూరంగా నల్లటి ఆకారం కనిపించింది. దీంతో రైలు ఆపి దగ్గరికి వెళ్లి చూసి చివరకు అంతా అవాక్కయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు మార్గ మధ్యలో ఉండగా డ్రైవర్‌కు పట్టాల మధ్యలో దూరంగా ఏదో నల్లటి ఆకారం కనిపించింది. దీంతో అదేంటో తెలుసుకోవాలని రైలు వేగం తగ్గించాడు. చివరకు ఇంజిన్‌ను ఆపి రైలు నుంచి దిగి నడుచుకుంటూ అక్కడికి వెళ్లాడు.

Viral Video: గుండె తరుక్కుపోయే వీడియో.. ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి..


అయితే తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. ఓ వ్యక్తి పట్టాలపై హాయిగా (man lying in middle of the train tracks) పడుకుని కనిపించాడు. పైగా ఎండ తగలకుండా గొడుగు సెట్ చేసుకుని, పట్టాలపై తల పెట్టి మరీ నిద్రపోతున్నాడు. దీంతో రైలు డ్రైవర్‌తో పాటూ మిగతా వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అయితే ఇదంతా చూస్తుంటే.. సరదా కోసమే వారు ఇలా చేసినట్లు అనిపిస్తోంది.

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..


అయినా కూడా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతడు పడుకునే స్థలంలో మీరు ట్రాక్స్ వేస్తే ఎలా’’.. అంటూ కొందరు, ‘‘ఇది వ్యాగన్ రైలు కాబట్టి ఆగింది.. లేకుంటే తాత పని అయిపోయేది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 54 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: విమానం ఎక్కబోతూ కూడా ఇదేం పని.. ఎయిర్‌హోస్టెస్‌ ఎదుటే ఇతడు చేసిన ఘనకార్యం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2024 | 08:39 PM