TS News: అమిత్ షా ఫేక్ వీడియో కేసు... నిందితులకు బెయిల్ మంజూరు
ABN , Publish Date - May 03 , 2024 | 03:30 PM
Telangana: కేంద్రహోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈకేసులో TPCC సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. పది వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు అయ్యింది.
హైదరాబాద్, మే 3: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah ) వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈకేసులో టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. పది వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు అయ్యింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
AP Politics: బయటపడుతున్న జగన్ కుట్రలు.. ఛీ కొడుతున్న జనం..
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. హస్తిన పోలీసులు నిన్నటి నుంచి హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాత్రంతా విచారించారు. ఫేక్ వీడియో కి సంబంధించిన కంప్యూటర్లు, హార్దిస్కులు, పెన్ డ్రైవ్‌ను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Video: స్కూటీ కాదది మినీ వైన్ షాపు.. ముసలోడు ఏం చేశాడంటే..?
AP Elections: నెల్లూరు ఎంపీగా గెలిచేదెవరు.. త్రిముఖ పోరులో పైచేయి ఎవరింటే..?
Read Latest Telangana News And Telugu News