Share News

Liquor Scam Case: వీడియో కాన్ఫరెన్స్ వద్దు.. కోర్టుకు నేరుగా హాజరుపర్చండి.. కవిత విజ్ఞప్తి..

ABN , Publish Date - May 03 , 2024 | 03:07 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) జ్యూడీషియల్ కస్టడీ మే 7వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. అయితే, తనను కోర్టుకు నేరుగా హాజరుపరచాలని..

Liquor Scam Case: వీడియో కాన్ఫరెన్స్ వద్దు.. కోర్టుకు నేరుగా హాజరుపర్చండి.. కవిత విజ్ఞప్తి..
Liquor Scam Case

న్యూఢిల్లీ, మే 03: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) జ్యూడీషియల్ కస్టడీ మే 7వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. అయితే, తనను కోర్టుకు నేరుగా హాజరుపరచాలని.. వీడియో కాన్ఫరెన్స్ వద్దని కోర్టును కోరారు కవిత. ఈ మేరకు కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు కవిత.


ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఖైదీగా తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, గతంలో కస్టడీ ముగిసినప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపరిచారు అధికారులు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుపరిచే అవకాశం ఉంది. దీంతో.. ఈ విచారణకు నేరుగా హాజరుపరచాలని కోరుతూ కోర్టు అప్లికేషన్ పెట్టుకున్నారు కవిత.


ఈ కేసులో కవిత అరెస్టైనప్పటి నుంచి నాలుగుసార్లు కస్టడీని పొడించింది రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం. కోర్టుకు హాజరైన సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఏర్పడింది. అయితే, గతంలో కోర్టులో విచారణకు హాజరైన కవిత.. మీడియాతో మాట్లాడారు. ఈ చర్యపై ట్రయల్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు అధికారులు. కానీ, ఈసారి అలా చేయబోనని.. తనను నేరుగా కోర్టుకు హాజరుపరచాలని కోర్టును కోరారు ఎమ్మెల్సీ కవిత. మరి దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే తెలియాలి.

For More Telangana News and Telugu News..

Updated Date - May 03 , 2024 | 03:07 PM