Bandi Sanjay : హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Jul 06 , 2024 | 05:50 PM
రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విమర్శించారు.
హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విమర్శించారు. కే. కేశవరావుతో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించిందని.. మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను చేపట్టవద్దని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకోలేదా.. మరి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.
ఈరోజు(శనివారం) బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారంపై ప్రజలు ఆలోచన చేసున్నారని అన్నారు. గ్రూప్ 1 నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌కి పెద్దగా తేడా ఏం లేదని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాను డైవర్ట్ చేస్తుందని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ..
KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..
Read Latest TG News And Telugu News