Share News

Indira Gandhi: ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం.. కంగనా రనౌత్‌‌కు భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:39 PM

సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Indira Gandhi: ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం.. కంగనా రనౌత్‌‌కు భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్

హైదరాబాద్: ఎమర్జెన్సీ సినిమాపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్‌పై విమర్శలు చేశారు. 2025 జనవరిలో ఎమర్జెన్సీ సినిమా విడుదల కానుంది. దేశ చరిత్రపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారని కంగనా రనౌత్‌‌‌ను భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఇవాళ(మంగళవారం)గాంధీ భవన్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 107వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మల్లు భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్న వారు ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు. అందరు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు ఆమె తీసుకుందని ఉద్ఘాటించారు. దేశాన్ని గొప్ప అగ్రగామిగా నిలబెట్టేందుకు చాలా నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. అనేక వర్గాలను ఒకే తాటిపై నడిపిన ఘనత ఇందిరా గాంధీది అని కొనియాడారు. దేశ సుస్థిరత కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిన ఘనత ఉక్కు మహిళ ఇందిరా గాంధీది అని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ ఈ దేశంలో పుట్టడం మనకు గర్వకారణమని అన్నారు.


ఇందిరా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా సంస్కరణలు తీసుకు వచ్చిందని గుర్తుచేశారు. ఆమె స్పూర్తితో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకోని వస్తామని ఉద్ఘాటించారు. ఇందిరా గాంధీ స్పూర్తితో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనతో కులగణన చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తున్నామని స్పష్టం చేశారు.కులగణన దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలబడుతుందని అన్నారు. దేశమే తెలంగాణ వైపు చూసేలా ఈ కులగణన ఉండబోతుందని చెప్పారు.


వరంగల్ నగరంలో ఈరోజు ఇందిరా గాంధీ స్పూర్తితో ఇందిరా మహిళ శక్తి పేరుతో మహిళలను అనేక రంగాల్లో తీర్చిదిద్దుతామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ , బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇద్దరు ఒక్కటేనని విమర్శించారు. లగచర్లలో అమాయక గిరిజనులను ఒక రాజకీయ పార్టీ రెచ్చగొట్టి కలెక్టర్ పైన దాడి చేయించారని ఆరోపించారు. ప్రజల దగ్గర నుంచి బీఆర్ఎస్ హయాంలో బలవంతంగా భూములు లాక్కున్నారని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 01:17 PM