Home » Gandhi Bhavan
దివంగత ప్రధాని, భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్థి పథంలో నడిపిన దార్శనికుడని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
కుల గణనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోగల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కులాలకు చెందిన వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టనున్నది. వచ్చేనెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వేను ప్రారంభించనున్నారు. దీనిపై చర్చించేందుకు బుధవారం గాంధీ భవన్లో కీలక సమావేశం జరగనుంది.
గాంధీభవన్‌లో మంగళవారం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీభవన్‌లో ఉండనున్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.
రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల కోసం ప్రజలు ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమానికి రావాల్సిన అవసరంలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
వారంలో రెండ్రోజులు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కో మంత్రి అందుబాటులో ఉండే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
ఇకపై మంత్రులు ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మూడు గంటలపాటు గాంధీ భవన్ వద్ద అందుబాటులో ఉండనున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
ఇకపై ప్రతి వారం.. బుధ, శుక్ర వారాల్లో ఎవరైనా ఒక మంత్రి.. గాంధీ భవన్లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.
టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.
కులగణన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.