MLC Notification:: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌లో బిగ్ ట్విస్ట్
ABN , Publish Date - Jan 05 , 2024 | 09:55 PM
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో పొలిటికల్ సీన్ మారనున్నది. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే తెలంగాణలో పొలిటికల్ సీన్ మారనున్నది. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ పై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యకత్ం చేసింది. బీఆర్ఎస్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటానని తెలిపింది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే ఒక్కో ఎమ్మెల్యేకు రెండు ఓట్లు వేసే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికల నిర్వహణతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోనున్నది.